E-Paper
Advertisement

జూనియర్ ఐఏఎస్‌లకు బంపర్ ఆఫర్.. సీఎం రేవంత్ టూర్ లిస్ట్‌లో బిగ్ చేంజెస్!

జూనియర్ ఐఏఎస్‌లకు బంపర్ ఆఫర్.. సీఎం రేవంత్ టూర్ లిస్ట్‌లో బిగ్ చేంజెస్!
Advertisement

IAS Tours: స్వేచ్ఛ బ్యూరో: సీఎం తో పాటు టూర్‌‌లకు వెళ్లేందుకు కొందరు సీనియర్ ఐఏఎస్‌లు పోటీ పడుతున్నారట. ఈ అంశంపై ఇప్పుడు సచివాలయంలో బిగ్ డిస్కషన్ మారింది. సీఎం టూర్ ఖరారు అయిందనే విషయం బయటకు రాగానే ఆయా ఆఫీసర్లు ఈ దఫా తాము వెళ్తామని పోటీపడి మరీ పేర్లు ఇస్తున్నారట. సీఎం వెంటే ఉండే పర్యటన బృందంలో చోటు దక్కించుకునేందుకు కొంతమంది ఐఏఎస్‌ అధికారులు తీవ్రంగా శ్రమించడం గమనార్హం.

ప్రతీసారీ పాత ముఖాలేనా?

తమకు అవకాశం ఇవ్వండి అని కొందరు ఐఏఎస్ లు సీఎంఓ వర్గాలను రిక్వెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఇది తెలిసి కింది స్థాయి అధికారులు అవాక్కవుతున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి పర్యటనల్లో సంబంధిత శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు ఉండటం ఆనవాయితీ. అయితే, సీఎం పర్యటనల్లో పాల్గొనడం ద్వారా వారి దృష్టిలో పడటం, వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం దక్కడం వంటి ప్రయోజనాలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. అందుకే,ప్రాధాన్యం లేని శాఖల్లో ఉన్నవారు లేదా ఇప్పటివరకు ఏ పర్యటనకూ వెళ్లని ఐఏఎస్‌ అధికారులు ఈసారి ‘టూర్ లిస్ట్’లో తమ పేరు ఉండేలా పావులు కదుపుతున్నట్లు తెలిసింది. అంతేగాక సీఎంవోని కొందరి అధికారుల మధ్య కూడా ఈ టూర్ సెలక్షన్ అంశంలో అంతర్గత విభేదాలు కూడా వచ్చినట్లు టాక్.

Advertisement

Also Read: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సిలిండర్ ధరలు భారీగా తగ్గింపు!

​లిస్ట్ ప్రిపరేషన్‌లో సీఎంఓ మల్లగుల్లాలు

​వచ్చే నెలలో జరిగే పర్యటనకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్, అధికారుల లిస్ట్ రూపకల్పన ప్రక్రియ మొదలైంది.సీఎం పర్యటనల ముఖ్య ఉద్దేశానికి తగ్గట్టుగా పెట్టుబడులు, సాంకేతికత, సంక్షేమం ..ఆయా రంగార్థంలో పట్టున్న అధికారులకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు.మరోవైపు గత పర్యటనల్లో పాల్గొన్నవారినే మళ్లీ తీసుకెళ్తే ఇతర అధికారుల్లో అసంతృప్తి వస్తుందనే కోణంలోనూ ఆలోచిస్తున్నారు.ఈసారి కొందరు ఉత్సాహవంతులైన జూనియర్ ఐఏఎస్‌లకు కూడా ఛాన్స్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే సీఎం టూర్ల కోసం అధికారులు పోటీపడటాన్ని క్రింది స్థాయి అధికారులు ఆశ్చర్యంగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది.

​పర్యటనల ద్వారానే ప్రాజెక్టులకు క్లియరెన్స్..

Advertisement

​సీఎంతో పాటు ప్రయాణించే సమయంలో వివిధ శాఖల ప్రణాళికలు, క్షేత్రస్థాయి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లడం సులువవుతుంది. ఫైళ్ల కదలికకు కూడా ఈ పర్యటనలు ఎంతగానో తోడ్పడతాయి. ఈ క్రమంలోనే “ఎప్పుడూ ఒకరిద్దరే వెళ్తే ఎలా? అందరికీ సమానంగా అవకాశాలు ఇవ్వాలి” అని కొందరు సీనియర్ అధికారులు అంతర్గతంగా తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు తెలిసింది. వచ్చే నెల సీఎంతో పాటు విమానం ఎక్కే ఆ ‘లక్కీ ఆఫీసర్లు’ ఎవరో తేలాలంటే షెడ్యూల్ లిస్ట్ అధికారికంగా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న NO UPI ఛాలెంజ్.. వీడియో వైరల్!

Related News

తెలంగాణకు రండి.. పెట్టుబడులు పెట్టండి.. సీఐఐ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

ఫార్ములా-ఈ స్కామ్‌లో KTR A-1.. ఏసీబీ 77 పేజీల ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

మేడ్చల్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణపై ఈసీఐ సెక్రటరీ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

ఓటర్లకు బిగ్ అలర్ట్.. తెలంగాణలో ‘SIR’ గడువు పొడిగింపు.. ఎన్ని రోజులంటే?

మీ ఓటు ఉందో లేదో డౌటా? ఒక్క మెసేజ్‌తో ఇలా చెక్ చేసుకోండి!

హైడ్రా కమిషనర్‌ను వెంటనే మార్చండి- హైకోర్టు

Big Stories

Advertisement
×