E-Paper
Advertisement

‘వారణాసి’ తర్వాత మహేష్ రూట్ మార్చుతున్నారా? అనిల్ రావిపూడితో స్పోర్ట్స్ డ్రామా?

‘వారణాసి’ తర్వాత మహేష్ రూట్ మార్చుతున్నారా? అనిల్ రావిపూడితో స్పోర్ట్స్ డ్రామా?
Advertisement

Mahesh Next Movie: గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లార్జ్ స్కేల్ అడ్వెంచర్ విజువల్ వండర్ ‘వారణాసి’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ ప్రతిష్టాత్మక చిత్రం సెట్స్‌పై ఉండగానే, దీని తర్వాత మహేష్ బాబు చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే దానిపై ఫిలిం నగర్ వర్గాల్లో ఆసక్తికరమైన ఊహాగానాలు షురూ అయ్యాయి.

Read also-సంచిత ఉగాలే ఆత్మహత్య.. నటీనటులపై పని ఒత్తిడి.. నటి ఆంచల్ ఖురానా సంచలన వ్యాఖ్యలు!

బుచ్చిబాబు టు సందీప్ రెడ్డి వంగా..

Advertisement

మొన్నటి వరకు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా లైన్ లో ఉన్నారంటూ, ఆయన మహేష్ బాబుకు ఒక ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ వినిపించారంటూ ప్రచారం జరిగింది. కానీ, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ కాంబినేషన్ సెట్ అవ్వడం దాదాపు అసాధ్యమని తెలుస్తోంది.

మరోవైపు, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. ఏషియన్ సినిమాస్ బ్యానర్‌లో మహేష్ బాబు – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ఒక ఊరమాస్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉందంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. గతంలో అనుకున్న ‘డెవిల్’ ప్రాజెక్ట్ లైన్ మళ్లీ తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మహేష్ ఇంట్రెస్ట్ అంతా అనిల్ రావిపూడిపైనే?

Advertisement

భారీ బడ్జెట్, మల్టిపుల్ టైమ్‌లైన్స్ మరియు హై-వోల్టేజ్ యాక్షన్‌తో సాగే ‘వారణాసి’ లాంటి పాన్-వరల్డ్ సినిమా కోసం మహేష్ బాబు శారీరకంగా, మానసికంగా ఎంతో శ్రమిస్తున్నారు. ఈ లార్జ్ స్కేల్ సినిమా పూర్తయిన తర్వాత, మైండ్ ఫ్రీ చేసుకునేలా ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని మహేష్ భావిస్తున్నారట. అందుకే ఆయన చూపు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వైపు ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్.

గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, మహేష్ లోని కామెడీ టైమింగ్‌ని వన్డే మ్యాచ్ రేంజ్ లో చూపించింది. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది.

క్రికెట్ కోచ్‌గా సూపర్ స్టార్?

ఫిలిం నగర్ నుంచి అందుతున్న లేటెస్ట్ బజ్ ప్రకారం.. అనిల్ రావిపూడి ఆల్రెడీ మహేష్ బాబుకు ఒక అదిరిపోయే లైన్ వినిపించారట. అవుట్‌ అండ్ అవుట్‌ హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగనుందని సమాచారం.

Read also-బుడ్డోడు, బుడ్డోడు అంటూ వైభ‌వ్ ను రెచ్చ‌గొట్ట‌ద్దు…లంక ప్లేయ‌ర్ల‌కు సంగ‌క్క‌ర హెచ్చ‌రిక‌

ఇన్ సైడ్ టాక్: ఈ సినిమాలో మహేష్ బాబు ఒక పవర్‌ఫుల్ అండ్ ఎనర్జిటిక్ క్రికెట్ కోచ్ పాత్రలో కనిపించబోతున్నారట. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టైమింగ్, ఎమోషన్స్‌తో పాటు స్పోర్ట్స్ డ్రామా కూడా తోడైతే థియేటర్లలో పూనకాలే అని చెప్పొచ్చు.

ప్రస్తుతానికి ఇవన్నీ ప్రాథమిక చర్చల దశలోనే ఉన్నప్పటికీ.. ‘వారణాసి’ లాంటి మైండ్ బ్లోయింగ్ సినిమా తర్వాత మహేష్ బాబు ఒక స్పోర్ట్స్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వైపు మొగ్గు చూపితే, అది ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద వింటేజ్ మహేష్ హవాను మళ్లీ రిపీట్ చేయడం ఖాయం. మరి ఈ ముగ్గురు దర్శకుల్లో సూపర్ స్టార్ ఎవరికి ఫైనల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి!

Related News

M.S. సుబ్బులక్ష్మిగా రష్మిక.. అఫీషియల్ అనౌన్స్మెంట్!

బాలీవుడ్ లో సంచలనం.. కియారా – సిద్ధార్థ్ విడాకులా?

సాంప్రదాయబద్ధంగా సమంత  సీమంతపు వేడుక వైరల్ అవుతున్న ఫోటోలు!

నటుడిగా మెప్పించి ‘నాగపూర్ పవిత్ర”టేక్డీ గణపతి ఆఫ్ నాగపూర్’ పుస్తకంతో రచయితగా మారుతున్న హీరో సూర్య తేజ్

పావలా శ్యామల కుమార్తె విషయంలో ‘మా’ కీలక నిర్ణయం!

నా ముందే ఆటిట్యూడ్‌తో తిరుగుతున్నావ్.. శోభితపై చైతూ ఓపెన్ కామెంట్స్.. వీడియో చూశారా?

ఆకట్టుకుంటున్న రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’ ట్రైలర్!

హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!

Big Stories

Advertisement
×