BigTV English

Hardik Pandya Divorce: హార్దిక్ విడాకుల రూమర్స్.. ఆ వ్యక్తితో నటాషా, అంతా డ్రామానా..?

Hardik Pandya Divorce: హార్దిక్ విడాకుల రూమర్స్.. ఆ వ్యక్తితో నటాషా, అంతా డ్రామానా..?

Hardik Pandya Divorce With Wife NataSa StankoviC: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా- నటాషా విడాకుల రూమర్స్ కొత్త టర్న్ తీసుకుంది. పాండ్యా వైఫ్ నటాషా శనివారం తన ఫ్రెండ్ అలెగ్జాండర్ అలెక్స్‌తో ముంబైలో కనిపించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో నటాషా ఓ పోస్టు చేసింది. ఎవరో రోడ్డున పడబోతున్నారని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఈ వ్యవహారం ఎక్కడి నుంచి మొదలైంది? అసలు ఎక్కడకు వెళ్తోంది? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.


ఐపీఎల్ 2024 పెద్ద చిచ్చురేగింది. ఈసారి ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారించాడు పాండ్యా. జట్టు కనీసం ప్లే ఆఫ్స్‌కి రాకపోవడంతో పాండ్యా వ్యవహారశైలిపై విమర్శలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా డైవోర్స్ వ్యవహారం వెలుగులోకి రావడం, అసలు పాయింట్ పూర్తిగా డైవర్ట్ అయ్యింది. ఇదే క్రమంలో నటాషా శనివారం ఆమె ఫ్రెండ్ అలెగ్జాండర్ అలెక్స్‌తో ముంబైలో కనిపించినట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె అతనితో కలిసి భోజనం చేసిందంటున్నారు. ఈ క్రమంలో నటాషా ఓ పోస్టు చేసింది. ఎవరో రోడ్డున పడబోతున్నారని రాసుకొచ్చింది.

పాండ్యా-నటాషా మధ్య జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. నటాషా పోస్టుతో పాండ్యా రోడ్డున పడడం ఖాయమనే చిన్నపాటి చర్చ జరుగుతోంది. ఐపీఎల్ తర్వాత పాండ్యా ఎక్కడికి వెళ్లాడు? అనేది అసలు ప్రశ్న. ప్రస్తుతం హార్దిక్‌పాండ్యా లండన్‌లో ఉన్నాడు. అక్కడి నుంచి నేరుగా అమెరికాకు వెళ్లనున్నాడు.


Also Read: Dipa Karmakar Record : దీపా కర్మాకర్ రికార్డ్.. గోల్డ్ మెడల్ సాధించిన తొలి ఇండియన్ జిమ్నాస్ట్

ఇదిలావుండగా ఒకవేళ హార్దిక్ పాండ్యా- నటాషాలు విడిపోతే ఏంటన్న దానిపై నెట్ యూజర్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అదే జరిగితే తన ఆస్తిలో 70శాతం ఆమెకి భరణంగా ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నా రు. అయితే హార్దిక్ ఆస్తులకు వచ్చిన నష్టమేమీ లేదన్నది మరికొందరి మాట. ఇందుకు కారణాలు లేకపోలేదు.

ఏడేళ్ల కిందట బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్ షోకు పాండ్య హాజరయ్యాడు. ఫ్యామిలీ ఆస్తుల్లో దాదాపు సగానికిపైగా తన తల్లి పేరిటే ఉన్నాయన్నాడు. అన్ని అకౌంట్స్‌లో పార్టనర్‌గా ఉంటానని అమ్మ చెప్పిందన్నాడు. కార్ల నుంచి ఇళ్ల వరకు ప్రతీది ఆమె పేరు మీదు ఉంటుంది. నా పేరు మీద ఏమీ తీసుకోలేదన్నాడు. ఈ లెక్కన హార్దిక్‌పాండ్యా పక్కా ప్లాన్ మీద ఉన్నాడనేది నెటిజన్ల మాట.

Also Read: టీ 20 అంటే ఫియర్ లెస్ క్రికెట్: గౌతం గంభీర్

హార్దిక్-నటాషా మ్యారేజ్ జరిగి నాలుగేళ్లు అయ్యింది. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. హ్యాపీగా సాగుతున్న సంసారంలో ఐపీఎల్ చిచ్చు రేపిందన్నది అభిమానుల మాట. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని పలుపులు తిరుగుతుందో? లేక బీ టౌన్‌లో రూమర్లు కామన్‌నని ఆ జంట లైట్‌గా తీసుకుంటుందో చూడాలి.

Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×