E-Paper
Advertisement

Nandan Yadav: ధోని లాగా సిక్సులు కొట్టింటే..ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించేవాళ్లం, నేపాల్ బౌలర్ హెచ్చ‌రిక‌

Nandan Yadav: ధోని లాగా సిక్సులు కొట్టింటే..ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించేవాళ్లం, నేపాల్ బౌలర్ హెచ్చ‌రిక‌
Advertisement

Nandan Yadav: ఐసీసీ టి20 ప్రపంచక 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026) నేపథ్యంలో పసికూన జట్లు ప్రభంజనం సృష్టిస్తున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ లో చిన్న జట్లు అన్నీ కూడా అద్భుతంగా రానిస్తున్నాయి. టీమిండియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్ లాంటి జట్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇందులో నేపాల్ మాత్రం అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోంది. నిన్న ఇంగ్లాండ్ తో నేపాల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో చివరి వరకు అద్భుతంగా రాణించింది నేపాల్. చివరి బంతికి ఇంగ్లాండ్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ పై తాజాగా నేపాల్ బౌలర్ నందన్ యాదవ్ ( Nepal Player Nandan Yadav) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోని ( MS Dhoni) లాగా సిక్సులు కొట్టి ఉంటే ఇంగ్లాండు పై తమ జట్టు గెలిచేదన్నారు.

Also Read: Inzamam-ul-Haq: USA బౌల‌ర్లతో సూర్య గుసగుస‌లాడాడు..అందుకే ఇండియా గెలిచింది, ఇంజమామ్ సంచ‌ల‌నం

ధోని లాగా సిక్సులు కొడితే మ్యాచ్ గెలవడం ఈజీనే

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇంగ్లాండ్ వర్సెస్ నేపాల్ ( England vs Nepal, 5th Match) మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో నాలుగు పరుగుల తేడాతో నేపాల్ ఓడిపోగా, ఇంగ్లాండ్ మూడు చెరువుల నీళ్లు తాగి విజయం సాధించింది. కొంచెం అయితే, నేపాల్ చేతిలో ఇంగ్లాండ్ ఓడిపోవాల్సి వ‌చ్చేది. అయితే ఈ మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత నేపాల్ బౌలర్ నందన్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్లో ధోని లాగా సిక్సులు ( MS Dhoni sixes) కొట్టి ఉంటే మ్యాచ్ గెలిచే వాళ్ళమని వెల్లడించారు.

మహేంద్ర సింగ్ ధోని లాగా సిక్సులు కొట్టడం ఇప్పటి నుంచి అయిన నేర్చుకోవాలని స్పష్టం చేశారు. ఇక నుంచి సిక్సుల పైన ఫోకస్ చేస్తామని ఆయన వెల్లడించారు. టీమిండియా జట్టును సిక్సులతో చాలా సార్లు మహేంద్ర సింగ్ ధోని గెలిపించాలని గుర్తు చేశారు. అతనిలా సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించడమే తన డ్రీమ్ అని బౌలర్ గా ఉన్న నందన్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో నందన్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఇంగ్లాండ్ పై నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయిన నేపాల్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో నేపాల్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నిన్న మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా నాలుగు పరుగుల తేడాతో పోరాడి గెలిచింది ఇంగ్లాండ్. ఈ మ్యాచ్లో మొదట ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లు ఆడింది. ఈ నేపథ్యంలో 7 వికెట్లు నష్టపోయిన ఇంగ్లాండు 184 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో 20 ఓవర్లలో ఆర్ వికెట్ల నష్టానికి 180 పరుగులు మాత్రమే సాధించింది నేపాల్. దీంతో పోరాడి ఓడిపోవాల్సి వచ్చింది.

Also Read: India vs Pakistan: ప్లాన్ మార్చిన పాకిస్తాన్‌, ఇండియాతో మ్యాచ్ కు రెడీ..ఆడ‌క‌పోతే అడుక్కుతింటార‌ని గంగూలీ వార్నింగ్‌

 

Related News

గౌతమ్ గంభీర్ దుర్మార్గుడు, వీధి రౌడీలా బిహేవ్ చేస్తాడు

ఇండియాలో హిందూ రాజ్యం న‌డుస్తోంది…షాహిద్ అఫ్రిది సంచ‌ల‌నం !

విడాకులు ఇవ్వ‌డం, కొత్త అమ్మాయిల‌తో తిర‌గ‌డం త‌ప్ప పాండ్యాకు ఏదీ చేత‌కాదు

భార‌త్ కు ఎదురుదెబ్బ‌…ఆసియా క్రీడల్లోనూ మెడ‌ల్స్ ఇవ్వ‌నున్న మొహ్సిన్ నఖ్వీ ?

వివాదంలో శ్రేయస్ అయ్యర్.. అసభ్య సైగలు చేస్తూ దొరికిపోయిన కెప్టెన్

ష‌మీ, భువ‌నేశ్వ‌ర్ కుమార్ ప‌ని అయిపోయింది..ఇక రిటైర్మెంట్ ఇచ్చేయండి

CSKతో పాటు ధోని కెరీర్ మార్చేశాడు..కానీ చివరకు అప్పుల బాధతో ఆత్మహ*త్య చేసుకున్నాడు

ఫ్లాట్ పిచ్ పైనే అభిషేక్ శర్మ ప్రతాపం… ఇజ్జత్ తీసిన రవిశాస్త్రి

Big Stories

Advertisement
×