BigTV English

New Zealand bowler : న్యూజిలాండ్ బౌలర్ ప్రపంచ రికార్డ్.. మరో మైలురాయి దాటిన బౌల్ట్..

New Zealand bowler : న్యూజిలాండ్ బౌలర్ ప్రపంచ రికార్డ్.. మరో మైలురాయి దాటిన బౌల్ట్..
New Zealand bowler

New Zealand bowler : ప్రపంచకప్ చరిత్రలో ఒక కొత్త రికార్డ్ నమోదైంది. న్యూజిలాండ్-బంగ్లాదేశ్ మధ్య చెన్నైలో జరిగిన మ్యాచ్ అందుకు వేదికగా నిలిచింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఈ ఘనత సాధించాడు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ ప్రారంభించిన వెంటనే వేసిన తొలి బంతికే వికెట్ దక్కించుకుని చరిత్ర సృష్టించాడు.


ఇంతవరకు జరిగిన అన్ని ప్రపంచకప్ ల్లో వేసిన తొలి బంతికి ఎవరూ వికెట్ తీసుకోలేదు. ఆ ఘనత బౌల్ట్ కే దక్కింది. ఈ రికార్డ్ రావడానికి కారణం ఎవరంటే బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్.  తానెదుర్కొన తొలి బంతికే అవుట్ అయి పెవిలియన్ చేరాడు. బహుశా ఇదొక కొత్త రికార్డు సృష్టిస్తుందని తను కూడా అనుకొని ఉండడు. ఉంటే మరింత జాగ్రత్తగా ఆడి ఉండేవాడేమో తెలీదు. కానీ క్రికెట్ లో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. అదే రీతిలో కివీస్ ఫాస్ట్ బౌలర్ బౌల్ట్ కూడా ఇలా ఒక ప్రపంచ రికార్డ్ తన పేరు మీద వస్తుందని ఊహించి ఉండడు.

ఇదే మ్యాచ్ లో మరో విశేషం ఏమిటంటే…ప్రపంచ రికార్డ్ సృష్టించిన ట్రెంట్‌ బౌల్డ్‌.. వన్డేల్లో 200 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇది తన వ్యక్తిగత రికార్డ్ అని చెప్పాలి.కెరీర్ లో అతనికి ఇదొక మైలు రాయి. ఒకే మ్యాచ్ లో రెండు రికార్డులను సొంతం చేసుకున్న స్టార్ పేసర్ బౌల్ట్ రాబోవు మ్యాచుల్లో ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాల్సిందే.


ఇకపోతే ఐపీఎల్ లో గాయపడి ఎన్నాళ్ల నుంచో జట్టుకి దూరంగా ఉన్న కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ డైరక్టుగా వచ్చి జట్టులో చేరాడు. అందరూ అతన్ని కేన్ మామగా పిలుస్తారు. అతను జట్టులో చేరడంతో జట్టుకి కొత్త ఉత్సాహం వచ్చినట్టయ్యింది. పట్టుదలగా ఆడి 78 పరుగులు చేసిన కేన్స్ ఆట మధ్యలో రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరగడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

అయితే ఇంగ్లాండ్, నెదర్లాండ్స్‌, బంగ్లాదేశ్ లను  ఓడించిన న్యూజిలాండ్.. హ్యాట్రిక్ విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×