BigTV English

NZ, Pak, SL Teams Defeat: న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక.. ఓటమి వెనుక కారణాలేమిటి?

NZ, Pak, SL Teams Defeat: న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక.. ఓటమి వెనుక కారణాలేమిటి?

NZ, Pak, SL Teams What Was the Reasons Behind the Defeat in T20 World Cup: కొన్ని దశాబ్దాలుగా క్రికెట్ ఆడుతున్న దేశాలు ఇవి. క్రికెట్ పుట్టిన ఇంగ్లండ్ నుంచి మొదలై.. ఇన్నేళ్లుగా కేవలం 10 దేశాలు మాత్రమే క్రికెట్ ని ఆదరిస్తూ వచ్చాయి. ఎప్పుడు ఆడినా అవే ఆడాలి. రికార్డులు కొట్టినా, కొట్టకపోయినా ఆ 10 దేశాల మధ్యే అంతా జరిగేది. ఆటగాళ్లు కూడా ఆ దేశాల నుంచే ఆ 10 మంది మాత్రమే ఉండేవారు. వారి చుట్టూనే రికార్డులు తిరుగుతూ ఉండేవి.


అలా ఆ దేశాల్లో క్రికెట్ కి ఆదరణ పెరిగింది. అలాగే ఆటలో నాణ్యతా పెరిగింది. క్రీడా నైపుణ్యాలు పెరిగాయి. తరతరాలుగా సీనియర్ల నుంచి నేర్చుకుని, వారసత్వంగా తర్వాత తరం క్రికెటర్లకు ఆ మెలకువలను అందిస్తూ వస్తున్నారు. అందువల్ల ఆ జట్లు పాత, కొత్త కలయికలతో కళకళలాడుతూ వస్తున్నాయి. అలాంటి పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక లాంటి  మూడు బలమైన జట్లు టీ 20 ప్రపంచకప్ లో లీగ్ దశను కూడా దాటలేకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

పాకిస్తాన్ జట్టుకి ఆది నుంచి నిలకడలేని జట్టుగా పేరుంది. ఆ దేశ ప్రజలకు కూడా అలవాటైపోయింది. వీళ్లు ఎప్పుడు ఆడతారో తెలీదు, వీళ్లు ఎప్పుడు గెలుస్తారో తెలీదు. అనే భావనలోకి వెళ్లిపోయారు. ఒకొక్కసారి వళ్లు మండి బీభత్సం చేస్తుంటారు. ప్రస్తుతం మాజీ లెజండరీ క్రికెటర్ వసీం అక్రమ్ మాట్లాడుతూ పాకిస్తాన్ జట్టుని మొత్తం ప్రక్షాళన చేయాలని కోరాడు. అలాగే యువ క్రికెటర్లలో టాలెంట్ ని పట్టుకునే వ్యవస్థలు అక్కడ సరిగా పనిచేయడం లేదని అంటున్నారు.


ఇక న్యూజిలాండ్ జట్టు విజయానికి వస్తే, ప్రపంచ క్రికెట్ జట్లలో మేటి అనదగ్గ ప్లేయర్లు అక్కడ ఉన్నారు. కేన్ విలియమ్సన్ కి కెప్టెన్ గా అద్భుతమైన రికార్డు ఉంది. అలాగే మంచి మంచి ప్లేయర్లు ఇండియన్ ఐపీఎల్ లో ఆడుతున్నారు. వారందరూ తేలిపోవడం ఆశ్చర్యంగా ఉందని నెటిజన్లు అంటున్నారు. పసికూన ఉగాండపై ఆఖరి మ్యాచ్ లో ప్రతాపం చూపింందని విమర్శిస్తున్నారు. 4 పాయింట్లతో వెనుతిరుగుతోంది. కివీస్ తో పోల్చుకుంటే ఆఫ్గాన్, వెస్టిండీస్ రెండు జట్లు బలమైనవి కావు..కానీ అవి రెండు సూపర్ 8 కి చేరాయి. విధి వైచిత్రి అంటే ఇదేనని అంటున్నారు.

Also Read: వరుణుడి ఆటంకం?.. నేడు కెనడాతో టీమ్ ఇండియా మ్యాచ్

శ్రీలంక జట్టు ఒకప్పుడు ప్రత్యర్థులను వణికించేది. అటాకింగ్ ప్లేలో ఆ జట్టుని మించిన వారు ఉండేవారు కాదు. మెగా ఐసీసీ ప్రపంచకప్ లను అవలీలగా గెలిచిన జట్టుగా పేరుండేది. క్రమేణా అక్కడ క్రికెట్ బోర్డుల్లో రాజకీయ జోక్యం పెరగడంతో నిజమైన క్రీడాకారులకు అక్కడ చోటు దొరకడం లేదు. రికమండేషన్ క్యాండిట్లతో మెగా కాంపిటేషన్లకు వెళ్లి చేతులెత్తేస్తున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్ లో ఘోర వైఫల్యం కారణంగా ఆ దేశమే స్పందించాల్సి వచ్చింది. ఐసీసీ నిషేధం విధించే స్థితికి వెళ్లింది.  మళ్లీ ఎలాగో టీ 20 ప్రపంచకప్ లో ఆడింది. ప్రస్తుతం గ్రూప్ డీలో ఉన్న శ్రీలంక బాగా ఆడితే బంగ్లాదేశ్ ని నిలువరించి వెళ్లేది. కానీ అలా జరగలేదు.

ఇంకా ఇంగ్లండ్ పరిస్థితి అటు ఇటుగా ఉంది. అక్కడ మ్యాచ్ గెలవడమే కాదు మంచి రన్ రేట్ తో గెలిస్తే స్కాట్లాండ్ ని దాటి సూపర్ 8 కి వచ్చే అవకాశాలున్నాయి. లేదంటే ఈ మూడు జట్ల జాబితాలోకి డిపెండింగ్ చాంపియన్ వెళ్లిపోతుంది.

Related News

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Big Stories

×