Nita Ambani : ప్రముఖ క్రికెటర్ ఇషాన్ కిషన్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఇతను గతంలో ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ టీమ్ కి ఆడాడు. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరపున ఆడుతున్నాడు. అయితే వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ తో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మరోసారి విఫలం చెందాడు. 3 బంతుల్లో కేవలం 2 పరుగులు చేసి స్టంప్ ఔట్ అయ్యాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ ఔట్ అయిన తరువాత క్రీజులోకి వచ్చాడు ఇషాన్ కిషన్. విల్ జాక్స్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్ నాలుగో బంతికి భారీ షాట్ ఆడాడు.
అయితే బతి బాగా స్పిన్ తిరగడంతో కిషన్ కి బంతి అందలేదు. దీంతో ముంబై వికెట్ కీపర్ స్టంప్ ఔట్ చేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ 68 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఇషాన్ కిషన్ ఔట్ అయిన వెంటనే ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ చప్పట్లు కొట్టింది. అంతకు ముందు సీజన్ లలో కిషాన్ చాలా సీజన్లు ముంబై తరపున ఆడాడు. అలాగే నిన్న మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇషాన్ కిషన్ ని సరదాగా అలా చెంప పైన కొట్టింది నీత అంబానీ. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇషాన్ కిషన్ ను 2025 మెగా ఆక్షన్ లో కొనేందుకు గానీ.. రిటైన్ చేసుకునేందుకు గానీ ఆసక్తి చూపించలేదు. దీంతో ముంబై తో జరిగిన మ్యాచ్ లో భారీ ఇన్నింగ్స్ ఆడి రివేంజ్ తీర్చుకుంటాడని భావించినా అలాందేమి జరగలేదు. వాస్తవానికి టోర్నీ ప్రారంభ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై సెంచరీ సాధించి సత్తా చాటాడు కిషన్. ఈ యువ బ్యాటర్ పై నమ్మకంతో రూ.11.25 కోట్ల ధరకు సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. చాలా మ్యాచ్ లలో సింగిల్ డిజిట్ కే పరిమితమై తీవ్ర నిరాశపరుస్తున్నాడు. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడంతో లీగ్ టేబుల్ లో 9వ స్థానంలో కొనసాగుతుంది. 8 మ్యాచ్ లలో 2 విజయాలు.. 5 ఓటములతో 4 పాయింట్లతో ప్లే ఆప్స్ ఆశలను మరింత కఠినం చేసుకుంది.
ఈ మ్యాచ్ ముగిసిన తరువాత సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ ఇషాన్ కిషన్ పై అభిమానులకు విపరీతమైన కోపం వచ్చింది. ఎందుకు కొన్నాంరా బాబు అంటూ తలలు బాదుకుంటున్నారు. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లో సెంచరీ చేయడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఆ తరువాత జరిగిన అన్ని మ్యాచ్ లలో చెత్త బ్యాటింగ్ చేశాడు. తరువాత జరిగిన 6 మ్యాచ్ ల్లో 0, 2, 2, 17, 9, 2 పరుగులు చేశాడు. ఓవరాల్ గా 7 మ్యాచ్ లలో 138 పరుగులు చేశాడు. చివరి 6 మ్యాచ్ లలో 32 పరుగులు మాత్రమే చేశాడు. ఆఫ్ ద ఫీల్డ్ లో డ్యాన్స్ లు చేస్తూ ఫోజులు కొట్టే ఇషాన్.. బ్యాటింగ్ లో మాత్రం విఫలం చెందుతున్నారని సన్ రైజర్స్ అభిమానులు పేర్కొంటున్నారు.