వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోనే ఉత్తర దిశకు ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏదైనా వేడుక నిర్వహించేటప్పుడు లేదా ఇల్లు నిర్మించేటప్పుడు ఉత్తర దిశను పూజ చేయడం వంటివి చేస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు తప్పు దిశలో ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు. ఇది పూర్తి ఫలితాలను ఇంటి ఉత్తర దిశకు సంబంధించి కొన్ని ప్రత్యేక నియమాలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయి. వీటిని ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉంది. సంపదకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిశలోనే ఉంటాడని అంటారు. ఉత్తర దిశలో కొన్ని రకాల వస్తువులు ఉంచడం ద్వారా మీరు కుబేరుడి ఆశీస్సులను పొందవచ్చు.
నీటి ఫౌంటెయిన్
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తర దిశలో నీటి ఫౌంటైన్ ఉండడం చాలా మంచిది. నీటికి సంబంధించిన ఏ వస్తువునైనా కూడా ఈ దిశలో ఉంచడం వల్ల శుభ్రంగా ఉంటుంది. మీరు ఉత్తర దిశలో నీటి కుండను లేదా నీటి యంత్రాన్ని కూడా పెట్టుకోవచ్చు. ఇది ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవాహాన్ని పంపిస్తుంది.
బంగారం లాకర్
ఇంటికి ఉత్తర దిశలో డబ్బులు బంగారం పెట్టుకునే లాకర్ ను భద్రపరచడం కూడా శుభప్రదమైనది. ఈ దిశలో సంపదకు చోటు కల్పించడం ద్వారా ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా చేసుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యులకు కుబేరుడి ప్రత్యేక ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెలుసుకుంటాయి.
జలపాతం చిత్రాలు
ఇంటికి ఉత్తర దశలో నదీ లేదా జలపాతం ఉన్న చిత్రాలను ఉంచితే ఎంతో మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం నీటి మూలకం ఉత్తర దిశలో ఉండడం వల్ల సానుకూలత పెరుగుతుంది. ఇంట్లో గొడవల వాతావరణం ఉంటే ఇలాంటి చిట్కాలను కచ్చితంగా పాటించాలి. ఉత్తర దిశలో నది జలపాతం ఉంచడం వల్ల ఇంట్లో శాంతియుత వాతావరణం నెలకుంటుంది. గొడవలు చాలా వరకు తగ్గుతాయి.
అక్వేరియం
వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం ఇంటికి ఉత్తర దిశలో అక్వేరియం ఉంచడం ఎంతో మంచిది అని చెబుతారు. ఉత్తర దిశలో ఉంచిన అక్వేరియం ఇంటి నుండి ప్రతికూల శక్తిని నాశనం చేస్తుంది. సానుకూల శక్తి ప్రసారమయ్యేలా చేస్తుంది. జీవితంలో డబ్బు ప్రవాహానికి కూడా మార్గాలు తెరుచుకుంటాయి. పనుల్లో అడ్డంకులు తొలగుతాయి. కాబట్టి వీలైనంతవరకు ఉత్తర దిశలోనే అక్వేరియం పెట్టడానికి ప్రయత్నించండి. ఉద్యోగంలో ఉన్న అడ్డంకులను కూడా తొలగిపోయేలా ఇవి చేస్తాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తర దిశలో కుబేరుడు చిత్రపటాన్ని ఉంచడం కూడా మంచిది. కుబేరుడు ఈ దిశలోనే నివసిస్తున్నాడని చెబుతారు. కాబట్టి కుబేరుడు చిత్రాన్ని ఉత్తర దిశలో ఉంచడం వల్ల ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సంపద వంటివన్నీ పెరుగుతాయి.