Virat Kohli Sensational Comments on After His Retirement: ఒక్క క్రికెట్ రంగంలోనే కాదు, ప్రతీ చోటా, ప్రతీ ఒక్కరికి కెరీర్ లో ఆఖరి రోజు అనేది వస్తుంది, అది నాకూ ఉంటుందని విరాట్ కొహ్లీ ఒక్కసారి బాంబ్ పేల్చాడు. ఆర్సీబీ ‘రాయల్ గాలా డిన్నర్’నేపథ్యంలో మాట్లాడుతూ ఒక్కసారి క్రికెట్ కి దూరమైపోతే, కొన్నాళ్ల పాటు మీ కంటికి కనిపించనని నవ్వుతూ అన్నాడు. అందుకే సాధ్యమైనంత ఎక్కువ పరుగులు చేయాలని, ఎక్కువ సేపు మైదానంలో గడపాలని, నాకెంతో నచ్చిన క్రికెట్ ఆడాలని భావిస్తున్నట్టు తెలిపాడు.
ఇటీవల విరాట్ భార్య అనుష్క శర్మ రెండో బిడ్డకి జన్మనిచ్చింది. అప్పుడు కూడా విరాట్ ఇలాగే అజ్నాతంలోకి వెళ్లిపోయాడు. బహుశా అలాగే చేస్తాడా? అని అంతా ఆలోచనలో పడ్డారు. ఈ సమయంలో తను మళ్లీ మాట్లాడుతూ ఒకసారి కెరీర్ ముగిసిన తర్వాత, ఇంట్లో తీరిగ్గా కూర్చుని, ఆ.. రోజు ఇంకా బాగా ఆడి ఉంటే బాగుండేది, లేదా ఆ పని చేయకుండా ఉంటే బాగుండేది, అలా వారిని అనకుండా ఉంటే బాగుండేదని ఆలోచిస్తూ…గతాన్ని తవ్వుకుంటూ కూర్చోవాలని అనుకోవడం లేదని అన్నాడు.
కెరీర్ చివర్లో పశ్చాత్తాపం పడే అవసరం రాకూడదని అనుకుంటున్నానని తెలిపాడు. అందుకే చేసే ప్రతి పనిని ఇష్టంగా చేస్తూ, సాధ్యమైనంతవరకు తప్పుల్లేకుండా చేయాలని అనుంటున్నట్టు తెలిపాడు. ఆ ప్రకారమే నడుచుకుంటున్నానని తెలిపాడు. నా తోటి సహచరుల మధ్య కోపతాపాలున్నా నేనే ముందడుగు వేసి మన్నించమని అడుగుతున్నాను. అందుకు సిగ్గు పడటం లేదని అన్నాడు. రిటైర్ అయిన తర్వాత విరాట్ ఒక మంచి క్రికెటర్ అని అందరూ అనుకోవాలనే చిన్న స్వార్థం నాలో కూడా ఉందని అన్నాడు.
Also Read: ఆర్సీబీ, చెన్నై మ్యాచ్‌కు వరుణ గండం.. బెంగళూరు ఆశలపై నీళ్లు..?
2008లో టీమ్ ఇండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన కొహ్లీ తదనంతర కాలంలో జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. రికార్డులతో ఆటలాడుకున్నాడు. సచిన్ టెండుల్కర్ స్రష్టించిన రికార్డులే కాదు , ప్రపంచ క్రికెట్ లో మేటి క్రికెటర్లు సాధించిన ఎన్నో రికార్డులను అవలీలగా దాటుకుంటూ వెళ్లాడు. భారత జట్టుకి కెప్టెన్ గా చేశాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడుతున్నాడు.
16 ఏళ్ల కెరీర్ లో ఒక్కసారి కూడా గాయాలబారిన పడి క్రికెట్ జట్టుకి దూరం కాలేదు. ఫిట్ నెస్ మీద విరాట్ కి ఎంతో శ్రద్ధ ఉంది. ఇదే అందుకు నిదర్శనమని అంటారు. ఐపీఎల్ పెట్టిన 2008 నుంచి కూడా ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం 2024 సీజన్ లో 661 పరుగులతో ఆరంజ్ క్యాప్ హోల్డర్ గా ముందడుగు వేస్తున్నాడు.
Also Read: T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ షురూ.. ఇండియా వార్మప్ మ్యాచ్ ఎప్పుడో తెలుసా..?
శనివారం నాడు సీఎస్కేతో జరిగే మ్యాచ్ లో గెలిస్తే…ప్లే ఆఫ్ రేస్ లో ఆర్సీబీ నిలుస్తుంది. అలా జరిగితే మరికొన్ని మ్యాచ్ లు ఆడే అవకాశం విరాట్ కి వస్తుంది. అప్పుడు ఆరెంజ్ క్యాప్ తనదేనని చెప్పాలి. అదొక్కటే కాదు కొహ్లీకి తీరని కోరికగా ఉన్న ఆర్సీబీ… కప్ సాధించాలి..ఐపీఎల్ లో సక్సెస్ ఫుల్ ఆటగాడిగా నిలవాలి…అని మనం కూడా కోరుకుందాం.కొహ్లీకి ఆల్ ది బెస్ట్ చెబుదాం.