IND Vs PAK : ఆసియా కప్ 2025 ప్రస్తుతం మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే రేపు టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 14న మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొందరూ మ్యాచ్ జరగాలి అంటే.. మరికొందరూ అస్సలు పాకిస్తాన్ తో మ్యాచ్ నే ఆడకూడదని పేర్కొంటున్నారు. ఆసియా కప్ లో భారత్-పాక్ మ్యాచ్ పై పహల్గామ్ ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన బాధితురాలు ఐషాన్య ద్వివేది స్పందించారు. బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో బీసీసీఐ క్రికెటర్లను బలవంతం పెట్టొద్దన్నారు. అసలు మ్యాచ్ కి కూడా అంగీకరించకుండా ఉండాల్సిందని ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాలను బీసీసీఐ విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Hardik pandya : రోబో కంటే దారుణంగా మారిపోతున్న హార్దిక్ పాండ్యా… అందుకే నటాషా వదిలేసిందా !
భారత్-పాక్ మ్యాచ్ పై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాగూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏసీసీ, ఐసీసీ నిర్వహించే మల్టీనేషనల్ టోర్నీల్లో అన్ని దేశాలు పాల్గొనాల్సిందేనని స్పష్టం చేశారు. లేదంటే టోర్నీ నుంచి ఎలిమినేట్ అవుతాయి. ప్రత్యర్థి జట్టుకు పాయింట్ ఇస్తారు. పాక్ తో భారత్ చాలా ఏళ్లుగా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటం లేదు. ఇండియా పై పాక్ ఉగ్రవాదదాడులు ఆపే వరకు ఆ నిర్ణయం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాగూర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 14న నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఆడకూడదని పలువురు టీమిండియా అభిమానులు పేర్కొంటున్నారు. ఒకవేళ మనం మ్యాచ్ ఆడకుంటే నేరుగా పాకిస్తాన్ జట్టుకి పాయింట్ వెళ్తుంది. దీంతో టీమిండియా వెనుకంజలోకి వెళ్తుందని పేర్కొన్నారు.
ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ పై మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలకవ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహించాల్సిన అవసరం ఏంటి..? అని ప్రశ్నించారు. ఈ మ్యాచ్ జరగకూడదని దేశం మొత్తం చెబుతుంది. అలాంటప్పుడు ఈ మ్యాచ్ ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు కేజ్రీవాల్. ఈ నేపథ్యంలో ఇటు టీమిండియా.. అటు పాకిస్తాన్ ఆటగాళ్లు మేము గొప్ప అంటే మేము గొప్ప అని పేర్కొంటున్నారు. టీమిండియా ను ఒమన్ ని ఓడించినట్టుగానే ఓడిస్తామని పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు టీమిండియా సీనియర్ ఆటగాళ్లు మాత్రం ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ జట్టును ఓడించడానికి భారత్ ఏ జట్టు సరిపోతుందని తెలిపారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్స్ వంటి ఐపీఎల్ ఆటగాళ్లే పాకిస్తాన్ పై విజయం సాధిస్తారని పేర్కొంటున్నారు. రేపు జరగాల్సిన ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.