Hardik pandya : టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అతను టీమిండియాలో కీలక ఆల్ రౌండర్ గా రాణిస్తున్నాడు. ముఖ్యంగా ఆసియా కప్ టీమ్ కి కూడ ఎంపికయ్యాడు. ఆసియా కప్ 2025లో భాగంగా యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్ లో కేవలం తొలి ఓవర్ ని హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేశాడు. అయితే 10 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఆ తరువాత మళ్లీ బౌలింగ్ చేయలేదు. లక్ష్యం చిన్నదే కావడంతో టీమిండియా కేవలం ఒక వికెట్ కోల్పోయి 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో హార్దిక్ పాండ్యా కి ఆ మ్యాచ్ లో బ్యాటింగ్ కి రాలేదు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.
Also Read : Asia Cup 2025 : టీమిండియాకు బీజేపీ ఎంపీ వార్నింగ్…పాకిస్థాన్ తో ఆడాల్సిందే !
ముఖ్యంగా హార్దిక్ పాండ్యా 2015 న ఒక గెటప్, 2016లో మరో గెటప్, 2017 లో ఇంకో గెటప్,2018, 2020, 2024, 2025 ఇలా రకరకాలుగా తన హెయిర్ స్టైల్ ని మార్చుకుంటూ వచ్చాడు హార్దిక్ పాండ్యా. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా హెయిర్ స్టైల్ కి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు రజనీకాంత్ రోబో గెటప్ లో కనిపించాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు ఈ వీడియోలో రజినీకాంత్ సూపర్ అని కామెంట్స్ చేయడం విశేషం. ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.
రేపే పాక్-ఇండియా మ్యాచ్
ఈ టోర్నీకే హైలెట్ గా నిలువనున్న అతిపెద్ద మ్యాచ్ మరో 24 గంటల్లోనే ప్రారంభం కానుంది. గత దశాబ్దంలో తొలిసారిగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు లేకుండా మ్యాచ్ జరుగనుంది. అయినప్పటికీ ఇరుజట్ల యువ ఆటగాళ్లు, స్టార్ ఆల్ రౌండర్లు ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ని గుర్తిండిపోయేవిదంగా సిద్ధంగా ఉన్నారు. ఈ మ్యాచ్ ను సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్స్ లో ప్రత్యక్ష్యంగా ప్రసారం చేస్తారు. మొబైల్, ల్యాప్ టాప్ లో మ్యాచ్ చూడటానికి, వీక్షకులు సోనీ లివ్ యాప్ ను ఉపయోగించవచ్చు. అంటే అభిమానులు ఇంట్లో ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా.. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ను ఎక్కడ మిస్ అవ్వరు. ఇప్పటివరకు ఆసియా కప్ లో ఇండియా-పాక్ 19 సార్లు తలపడ్డాయి. అందులో 10 మ్యాచ్ లు టీమిండియా విజయం సాధించింది. పాకిస్తాన్ 06 సార్లు విజయం సాధించింది. మూడు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. పాకిస్తాన్ చివరిసారిగా 2022లో దుబాయ్ లో భారత్ ను ఓడించింది. మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ నవాజ్ అద్భుతమైన బ్యాటింగ్ తో మ్యాచ్ ను మలుపుతిప్పారు. ప్రస్తుతం ఈ మ్యాచ్ వీక్షించేందుకు కొందరూ టీమిండియా అభిమానులు ఆసక్తి చూపించడం లేదు. పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడి చేయడమే అందుకు కారణం.
I got this video from Instagram, and it's so funny 😂
Hardik Pandya's hairstyles over the years 😅 and don't miss Surya Kumar Yadav's "Super" 😆
A Must Watch Video 😁 pic.twitter.com/kerWU6aikv
— Richard Kettleborough (@RichKettle07) September 13, 2025