Ragi Good For Diabetics: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడే రాగులను ‘మిల్లెట్ క్వీన్’ అని పిలుస్తారు. దీనిలోని పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగపడతాయి. ఇది శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి.. జీవక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. రాగులలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను ఆలస్యం చేస్తుంది. అందుకే రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా విడుదలవుతాయి. ఇది మధుమేహాన్ని నియంత్రించడానికి సహాయ పడుతుంది.
షుగర్ ఉన్నవారు రాగులను ఎలా ఉపయోగించాలి ?
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్: రాగులలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచదు. దీనిలో ఉండే ఫైబర్ కారణంగా ఇది రక్తంలోకి చక్కెర శోషణను నెమ్మదిగా చేస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం: రాగులలో ఉండే ఫైటోకెమికల్స్, యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి, కణాలను దెబ్బ తినకుండా కాపాడతాయి.
మెగ్నీషియం, కాల్షియం అధికంగా ఉండటం: రాగులలో ఉండే మెగ్నీషియం శరీరంలో ఇన్సులిన్ పని తీరును మెరుగు పరుస్తుంది. అంతే కాకుండా ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో కూడా సహాయ పడుతుంది.
Also Read: వందేళ్లు బ్రతకాలా ? ఇవి తింటే సరి !
మధుమేహం ఉన్నవారు రాగులను ఉపయోగించే 4 సులభమైన మార్గాలు:
రాగి రొట్టె: గోధుమ పిండికి బదులుగా రాగి పిండితో రొట్టెలు చేసుకోవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఉదయం టిఫిన్‌గా లేదా రాత్రి భోజనానికి ఇది మంచి ఎంపిక.
రాగి ఇడ్లీ లేదా దోశ: రాగి పిండిని ఇడ్లీ లేదా దోశ పిండిలో కలిపి చేసుకోవచ్చు. ఇది కేవలం రాగి పిండితో చేసుకునే దానికంటే రుచికరంగా.. ఆరోగ్యంగా ఉంటుంది.
రాగి జావ లేదా గంజి: రాగి పిండిని నీటిలో లేదా మజ్జిగలో కలిపి జావలా తయారు చేసుకోవచ్చు. దీనిని ఉదయం పూట తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.
రాగి ఉప్మా: రాగి పిండితో కూరగాయలు, మసాలాలు కలిపి ఉప్మా చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యకరమైన, కడుపు నింపే అల్పాహారం.