PAK vs UAE : ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ కి వరుసగా షాక్ ల మీద షాక్ తగులుతోంది. ముఖ్యంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమి పాలై షాక్ కి గురైన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ లో భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వవద్దని నిర్ణయం తీసుకున్నారు. హ్యాండ్ షేక్ వివాదాన్ని క్రియేట్ చేసి.. మూడు రోజులుగా వైరల్ చేస్తున్నారు. మరోవైపు మ్యాచ్ రిఫరీ పై ఐసీసీకి ఫిర్యాదు కూడా చేసింది పీసీబీ. తాజాగా యూఏఈతో జరిగే మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అయింది. వాస్తవానికి రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ 9 గంటలకు ప్రారంభం అయింది.
Also Read : Asia Cup 2025: పాకిస్తాన్ కు రూ. 285 కోట్ల నష్టం…ఐసీసీ దెబ్బ అదుర్స్ ?
పాకిస్తాన్ జట్టు నో షేక్ హ్యాండ్ సాకుతో టోర్నీ నుంచి వైదొలిగే ప్రయత్నం కూడా చేసింది. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పొలిటికల్ గా కామెంట్స్ చేశాడని పీసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సూర్యకుమార్ యాదవ్ పొలిటికల్ గా చేసిన కామెంట్స్ కి క్షమాపణ చెప్పాలని.. మ్యాచ్ రిఫరీ ఆండ్రీ క్రాప్ట్ ను తొలగించాలని డిమాండ్లు పెట్టింది పీసీబీ. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ యూఏఈ మ్యాచ్ కి ఆండి పై క్రాప్ట్ ను తప్పించాలన్న పాకిస్తాన్ డిమాండ్ కి ఐసీసీ షాక్ ఇచ్చింది. పాక్-యూఏఈ మ్యాచ్ కి అతడినే మ్యాచ్ రిఫరీగా కొనసాగిస్తోంది. మరోవైపు హ్యాండ్ షేక్ వివాదం పై మ్యాచ్ రిఫరీ పైక్రాప్ట్ తమకు క్షమాపణ చెప్పాడని పీసీబీ క్లెయిమ్ చేసుకోవడం గమనార్హం. ఆసియా కప్ లో పాక్ కొనసాగడం పై కాసేపు నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ విషయంలో ఐసీసీ ఏమాత్రం తగ్గకపోవడంతో పీసీబీ తోక ముడిచింది. నో హ్యాండ్ షేక్ ఉదంతంతో పైక్రాప్ట్ ది ఏ తప్పు లేదని.. మరోసారి ఐసీసీ పీసీబీకి స్పష్టం చేసింది. మ్యాచ్ అఫీషియల్స్ విషయంలో పీసీబీ అతిని సహించబోమని కూడా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.
ఇక చేసేది ఏమి లేక పీసీబీ తమ ఆటగాళ్లను మ్యాచ్ ఆడటానికి మైదానానికి రావాల్సిందిగా ఆదేశించింది. మ్యాచ్ ను గంట ఆలస్యంగా ప్రారంభించాలని నిర్వహకులకు కబురు పంపింది. మరోవైపు పీసీబీ డిమాండ్లను పరిశీలించిన ఐసీసీ.. షేక్ హ్యాండ్ ఇవ్వడమనేది ఆటగాళ్ల వ్యక్తిగత విషయం అని కొట్టి పారేసింది. ఇక షేక్ హ్యాండ్ విషయంలో పైక్రాప్డ్ పాత్ర ఏమి లేదని.. యూఏఈతో మ్యాచ్ కి అతడినే రిఫరీగా కొనసాగిస్తామని ప్రకటించింది ఐసీసీ. ఒకవేళ ఆసియా కప్ లో యూఏఈతో మ్యాచ్ ను పాకిస్తాన్ బాయ్ కాట్ చేసి ఉంటే ఆర్థికంగా భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. ఆ దేశ క్రికెట్ బోర్డు సుమారు రూ.145 కోట్ల ఆదాయం కోల్పోయేది. మ్యాచ్ ను ఉద్దేశపూర్వకంగా బాయ్ కాట్ చేసినందుకు క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల కింద సుమారు రూ.140 కోట్లు ఐసీసికి చెల్లించాల్సి ఉండేదని విశ్లేషకులు అంచనా వేశారు. పాకిస్తాన్ ఈ టోర్నీ నుంచి కూడా నిష్క్రమిస్తే.. మొత్తం రూ.285 కోట్లు చెల్లించాల్సి వచ్చేది. కానీ అంత చెల్లించాల్సి వస్తుందనే ఏమో.. బ్యాగ్ లు సర్దుకున్న ఆటగాళ్లు మళ్లీ రిటర్న్ వచ్చారు.