Asia Cup 2025: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు ఏకంగా 285 కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. అయితే ఆ ప్రమాదం నుంచి క్షణాల్లోనే బయటపడింది పాకిస్తాన్. లేకపోతే 285 కోట్లు… పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి ఆవిరి అయిపోయేవి. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… షేక్ హ్యాండ్ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదానికి ముఖ్య కారణం రిఫరీ ఆండీ అంటూ పాకిస్తాన్ మొండి పట్టు పట్టింది. అతన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ… యూఏఈ మ్యాచ్ ను బైకాట్ చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చింది. అయితే పాకిస్తాన్ పిట్ట బెదిరింపులకు ఐసీసీ ఎక్కడ బెదరలేదు. మ్యాచ్ ఆడకపోతే భారీ ఫైన్ పడుతుందని వార్నింగ్ ఇచ్చింది. దెబ్బకు పాకిస్తాన్ దిగి వచ్చింది.
Also Read: Team India : ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా అరుదైన రికార్డు… ఇప్పటివరకు ఏ జట్టు సాధించని చరిత్ర
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ జరుగుతున్న యూఏఈ మ్యాచ్ ను పాకిస్తాన్ ఒకవేళ బైకాట్ చేసి ఉంటే పాకిస్తాన్ చాలా నష్టపోయేది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సుమారు 145 కోట్ల ఆదాయం కోల్పోయేదని…. సంచలన రిపోర్టు బయటకు వచ్చింది. ఇక ఈ మ్యాచ్ ను ఉద్దేశపూర్వకంగా బై కాట్ చేసినందుకు క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల కింద సుమారు 140 కోట్లు ఐసీసీకి చెల్లించాల్సి ఉండేదని చెబుతున్నారు. అంటే మొత్తంగా 285 కోట్ల నష్టం… పాకిస్తాన్ జట్టుకు వాటిల్లేది. ఇదంతా ఆలోచించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు… యూఏఈ మ్యాచ్ ఆడేందుకు వచ్చింది. దీంతో యధావిధిగా మ్యాచ్ జరుగుతోంది.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో…. షేక్ హ్యాండ్ వివాదం బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో భాగంగా మొన్న ఆదివారం అంటే సెప్టెంబర్ 14వ తేదీన టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇందులో 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయం.. సాధించడం జరిగింది. చివరకు సిక్సర్ కొట్టి… మ్యాచ్ గెలిపించాడు సూర్య కుమార్ యాదవ్. అయితే ఆ సమయంలో శివం దుబే కూడా బ్యాటింగ్ చేస్తున్నాడు. మ్యాచ్ విన్ అయిన తర్వాత పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వాల్సింది. కానీ టీమిండియా మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. పహల్గాం సంఘటన నేపథ్యంలో.. ఇలా వ్యవహరించారు టీమ్ ఇండియా. అయితే… రిఫరీ ఆండీ సమక్షంలోనే జరిగింది. టాస్ వేస్తున్నప్పుడు కూడా సూర్యకుమార్ ఇలాగే వ్యవహరించాడు. అయినా కూడా రిఫర్ ఆండీ చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే అతన్ని తప్పించాలని డిమాండ్ చేస్తుంది పాకిస్తాన్. కానీ ఐసీసీ మాత్రం పాకిస్తాన్ మాట వినడం లేదు.
Pakistan went ahead with the UAE clash as skipping it could have cost them USD 16 million.#AsiaCup2025 #PCB #CricketTwitter pic.twitter.com/ifB2zQ3Iws
— InsideSport (@InsideSportIND) September 17, 2025