BigTV English

Canadian Influencer: ఇండియన్ రైల్ ఎక్కిన కెనడా అమ్మాయి.. రైల్వే గురించి ఆమె చెప్పింది వింటే ఫ్యూజులు అవుట్!

Canadian  Influencer: ఇండియన్ రైల్ ఎక్కిన కెనడా అమ్మాయి.. రైల్వే గురించి ఆమె చెప్పింది వింటే ఫ్యూజులు అవుట్!

Canadian  Influencer On Indian Railway:

గత దశాబ్ద కాలంగా భారతీయ రైల్వే మరింత అభివృద్ధి చెందింది. వేగవంతమైన ప్రయాణాన్ని అందించడంతో పాటు ప్రయాణ సమయంలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలను కల్పిస్తోంది. నిత్యం దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణీకులు  రైళ్లలో ఆహ్లాదకరమైన జర్నీ కొనసాగిస్తున్నారు. తాజాగా ఇండియాకు వచ్చిన కెనడియన్ సోషల్ మీడియా ఇన్ ప్లూయెన్సర్ రేచెల్ రీమర్ హర్లీ రైల్లో ప్రయాణించించింది. ఈ సందర్భంగా ఆమె భారతీయ రైల్వేపై ప్రశంసల జల్లు కురిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


7 గంటల పాటు రైల్లో ప్రయాణించిన రేచెల్

తాజాగా రేచెల్ 7 గంటల పాటు రైలు  ప్రయాణం చేసింది. ఈ సందర్భంగా ఆమె భారతీయ రైల్వే పై ప్రశంసలు కురిపించింది. రైలు ఎక్కేందుకు తన ప్రయాణాన్ని ఉదయం 5 గంటలకే మొదలు పెట్టినట్లు చెప్పింది. ఉదయం 7 గంటలకు రైల్వే స్టేషన్ కు చేరుకుంది. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లలోని పరిస్థితుల గురించి వివరించింది. ఆ తర్వాత ఆమె రైలు ఎక్కింది. ఏసీ 3-టైర్ కోచ్‌ లో కూర్చుని, పుస్తకాన్ని చదివింది. రైల్లోని ఫుడ్ టేస్టీ చేసింది. సమోసాలను కొనుగోలు చేసి హ్యాపీగా తినేసింది.  “ఇది నేను భారతదేశంలో ప్రయాణించిన మూడవ రైలు. ఏడు గంటల ప్రయాణానికి దాదాపు 12 డాలర్లు(సుమారు రూ. 1050) ఖర్చవుతుంది. కానీ, నాకు భారతదేశంలోని రైళ్లు చాలా ఇష్టం. అవి కచ్చితంగా దేశాన్ని చూడటానికి బెస్ట్ ఆప్షన్” అని చెప్పుకొచ్చింది. అదే సమయంలో 68,000 కిలోమీటర్లకు పైగా ట్రాక్‌ లతో రోజూ లక్షలాది మంచి ప్రయాణీకులను రైళ్లు గమ్య స్థానాలకు చేర్చుతున్నట్లు వెల్లడించింది.


ప్రయాణీకులకు కీలక సూచనలు   

ఇక ఈ సందర్భంగా ఆమె భారతీయ రైల్వే ప్రయాణీకులకు కీలక సూచన చేసింది. పండుగల సమయం వస్తున్న నేపథ్యంలో ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. ఇక ఈ సందర్భంగా ఆమె 5 అంశాల గురించి పంచుకుంది. అవేంటనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ జనసమూహాలు: భారతీయ రైళ్లు ముఖ్యంగా రిజర్వ్ చేయని కోచ్ లు రద్దీగా ఉంటాయి. ఈ కోచ్ లలో ప్రయాణించే వారు ముందుగానే స్టేషన్ కు రావాలి. వస్తువులను సేఫ్ గా భద్రపర్చుకోవాలి. రైళ్లలో స్థానికులు, ప్రయాణికులు,  విక్రేతల ఎంతో ఉత్సాహంగా పలకరిస్తారు. చాలా మంది నాతో మాట్లాడేందుకు ప్రయత్నించడం సంతోషం అనిపించిందని వివరించింది.

⦿ విక్రేతలు: రైలు ప్రయాణంలో వీళ్ల సందడి చాలా ఎక్కువగా ఉంటుంది. చాయ్, కాఫీ, స్నాక్స్, సమోసాలు, తాజా పండ్లు అమ్మే విక్రేతలు కోచ్‌ల గుండా నడుస్తూ ఉంటారు.

⦿ సీట్లు: సైడ్ లోయర్ బెర్త్ బయటి అద్భుతమైన దృశ్యాలను చూసేందుకు అనుగుణంగా ఉంటుంది. రైలు కిటికీల గుండా గ్రామీణ ప్రాంతాల అందాలు, సందడిగా ఉండే పట్టణాలను చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.

⦿ టాయిలెట్స్: వీలైనంత వరకు ఎవరికి వారు తమ సొంత టాయిలెట్ పేపర్ తెచ్చుకోవడం మంచిది.

 ⦿ ఊహించని ఘటనలు: కొన్నిసార్లు రైళ్లు ఆలస్యంగా నడుస్తాయి. ప్లాట్‌ ఫారమ్‌ మారే అవకాశం ఉంటుంది. రైలు ప్రయాణం చేసే సమయంలో ముందుగానే వీటి గురించి తెలుసుకోవాలని చెప్పింది.

Read Also: జొమాటోతో మేక్ మై ట్రిప్ జోడీ, ఇక రైల్వే ప్రయాణీకులకు నేరుగా ఫుడ్ డెలివరీ!

Related News

Meal Delivery: జొమాటోతో మేక్ మై ట్రిప్ జోడీ, ఇక రైల్వే ప్రయాణీకులకు నేరుగా ఫుడ్ డెలివరీ!

Finland: ఫిన్‌ లాండ్ లో ఇండియన్స్ పర్మినెంట్‌గా ఉండిపోవచ్చట.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

Vande Bharat Trains: హైదరాబాద్ నుంచి ఆ నగరాలకు మరో రెండు వందేభారత్ రైళ్లు!

Trains Cancelled: సికింద్రాబాద్‌కు వెళ్లే ఈ రైళ్లు క్యాన్సిల్.. కొన్ని డైవర్ట్!

Diwali Special Trains: దీపావళికి ఏకంగా 1,126 ప్రత్యేక రైళ్లు.. ఏయే రూట్లలో అంటే?

Railway Rules: రైల్వే కొత్త రూల్.. ఇకపై మొదటి 15 నిమిషాలు వారు మాత్రమే టికెట్ బుక్ చేసుకోవాలి!

Kedarnath Ropeway: రూ. 4 వేల కోట్లతో కేదార్‌నాథ్ లో కళ్లు చెదిరే రోప్‌వే.. ఇది ప్రపంచంలోనే వెరీ వెరీ స్పెషల్!

Big Stories

×