BigTV English

Babar Azam Surpasses Virat Kohli: విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్!

Babar Azam Surpasses Virat Kohli: విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్!

Babar Azam Surpasses Virat Kohli: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అంటే అందరికీ సుపరిచితమైన పేరు. వన్డే వరల్డ్ కప్ భారత్ లో జరిగినప్పుడు తను కెప్టెన్ గా ఉన్నాడు. ఆ సమయంలో భారత్ లో ఆతిథ్యం బాగుంది, అభిమానులు బాగా సపోర్ట్ చేశాడని పదే పదే చెప్పుకొచ్చాడు. ఆఖరికి పరాజయంతో ఇండియా వదిలి వెళ్లిపోతూ కూడా భారతీయులందరికీ క్రతజ్నతలు చెబుతూ వెళ్లాడు. అంతేకాదు ఒక సందర్భంలో కోహ్లీ కనిపిస్తే, తనని అడిగి జెర్సీ తీసుకున్నాడు. అంతేకాదు కొహ్లీ నా అభిమాన క్రికెటర్ అని, నా గురువు లాంటివాడు అని బహిరంగంగా తెలిపాడు.


అలాంటి బాబర్ ఆజామ్.. నేడు టీ 20 అంతర్జాతీయ క్రికెట్ లో విరాట్ కోహ్లీ రికార్డ్ ఒకటి బ్రేక్ చేశాడు. అదేమిటంటే ఇంతవరకు అత్యధికంగా హాఫ్ సెంచరీలు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ (38) పేరు మీద ఉంది. 117 మ్యాచ్‌లల్లో 109 ఇన్నింగ్స్‌లల్లో కోహ్లీ 38 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ కలిపి 4,037 పరుగులు చేశాడు. వ్యక్తిగత అత్యధిక పరుగులు 122 నాటౌట్. బ్యాటింగ్ యావరేజ్ 51.75. స్ట్రయికింగ్ రేట్ 138.15గా నమోదైంది. ఇందులో 361 సిక్సర్లు, 117 బౌండరీలు ఉన్నాయి.

తాజాగా ఈ హాఫ్ సెంచరీల రికార్డును బాబర్ ఆజామ్ బ్రేక్ చేశాడు. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు. డబ్లిన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లల్లో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. అయితే పాకిస్తాన్ 17 ఓవర్లల్లోనే ఈ లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి విజయం సాధించింది.


Also Read: టీ 20 ప్రపంచకప్.. సత్తా చాటింది.. ఐదుగురు మాత్రమే..

ఈ మ్యాచ్ లో బాబర్ ఆజామ్ అద్భుతంగా ఆడి, 42 బంతుల్లో అయిదు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 75 పరుగులు చేశాడు. దీంతో తన కెరీర్ లో 39వ హాఫ్ సెంచరీ చేసి కొహ్లీ రికార్డ్ ని బ్రేక్ చేశాడు. . బాబర్ అజామ్ వన్డే ప్రపంచకప్ ఆడినప్పుడు ఫామ్ లో లేడు. ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. మరి టీ 20 ప్రపంచకప్ లో తన ఆటపైనే పాకిస్తాన్ అభిమానులు అందరూ ఆశలు పెట్టుకున్నారు. మరేం చేస్తాడో చూడాల్సిందే.

Related News

England vs South Africa : ఇంగ్లాండ్ అరాచకం…20 ఓవర్లలో 300+ రన్స్..చ‌రిత్ర‌లోనే తొలిసారి…30 ఫోర్లు, 18 సిక్సర్లు

Surya kumar yadav : అదృష్టం అంటే సూర్యదే… నలుగురు కెప్టెన్స్ అతను చెబితే ఫాలో కావాల్సిందే

Pak vs Oman : బ్యాటింగ్ లో కాస్త త‌డ‌బ‌డ్డ‌ ఒమ‌న్.. ఆసియా క‌ప్ లో పాక్ తొలి విజ‌యం

Root : రూట్ సెంచరీ చేయకపోతే న**గ్నంగా నడుస్తా…!

Gill-Fatima : ఈ హీరోయిన్ తో కూడా గిల్ కు రిలేషన్..?

Asia Cup 2025 : బుమ్రాకు వార్నింగ్… వాడి బౌలింగ్ లో 6 సిక్సర్లు కొడతా!

IND Vs PAK : ఆదివారం మీకు చుక్కలు చూపించడం పక్కా.. కమ్రాన్ అక్పల్ సంచలనం

Bumrah : గ్రౌండ్ లో పెయింటింగ్ వేసుకుంటున్న బుమ్రా… ఫ్యామిలీ పేరుతో

Big Stories

×