BigTV English

Scary Car Accident: 160 స్పీడులో కారు.. వీడియో తీస్తుండగా యాక్సిడెంట్.. నలుగురు మృతి!

Scary Car Accident: 160 స్పీడులో కారు.. వీడియో తీస్తుండగా యాక్సిడెంట్.. నలుగురు మృతి!

4 Killed while Taking Video on 160KM Speed Driving in Gujarat: అహ్మదాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐదుగురు యువకులు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీ కొట్టడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. ప్రమాద సమయంలో కారు 160 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో ప్రమాదానికి ముందు యువకులు షేర్ చేశారు.


గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఐదుగురు యువకులు కారులో ప్రమాదకర వేగంతో ప్రయాణిస్తూ అందుకు సంబంధించిన వీడయోను ఇన్ స్టా గ్రామ్ లో లైవ్ పోస్టు చేశారు. మే 2వ తేదీ అర్థరాత్రి ఐదుగురు యువకులు అహ్మదాబాద్ నుంచి ముంబైకి కారులో బయలు దేరారు. నేషనల్ హైవేపై కారు 140 నుంచి 160 కిలో మీటర్ల వేగంతో వెళ్లడాన్ని ఇన్ స్టా గ్రామ్ లైవ్ లో చూపించి కేరింతలు కొట్టారు. అయితే అంతలోనే విషాదం చోటుచేసుకుంది.

రోడ్డుపైన వెళుతున్న పలు వాహనాలను కారు డ్రైవర్ దాటుతూ ముందుకు కదులుతుండటంతో అతడిని మిగిలిన యువకులు మరింత ఎంకరేజ్ చేశారు. దీంతో యువకుడు మరింత స్పీడు పెంచగా అదుపు తప్పిన కారు రోడ్డు ప్రక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న ఐదుగురు యువకులలో నలుగురు ప్రమాదంలో మరణించారు.


Also Read: సుప్రీం కోర్టు ఆగ్రహం.. సీఎస్‌కు సమన్లు

ఇదిలా ఉంటే కారు నడిపిన ముసాఫా అలియాస్ షహబాద్ ఖాన్ పఠాన్ గాయాలతో బయటపడగా అతడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వీరి లైవ్ స్ట్రీమింగ్ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Tags

Related News

Modi To Manipur: రెండున్నరేళ్లుగా మణిపూర్ కి మొహం చాటేసిన మోదీ.. రేపే రీఎంట్రీ

Supreme Court: దేశవ్యాప్తంగా బాణసంచాపై నిషేధం.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

Modi Mother: మోదీకి కలలో కనిపించిన తల్లి..? డీప్ ఫేక్ వీడియోపై మండిపడుతున్న బీజేపీ

Delhi High Court: ఢిల్లీలో హై టెన్షన్..హైకోర్టుకు బాంబు బెదిరింపు

Kerala Wedding: కేరళలో అదే పరిస్థితి.. అక్కడా పెళ్లి కాని ప్రసాదులు, మాంగల్యం ఈవెంట్‌కి నో రెస్పాన్స్

Delhi Terrorists Arrested: ఢిల్లీలో ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్

Traffic Challans: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఈ తేదీన ట్రాఫిక్ చలాన్ల మాఫీ? ఇలా చెయ్యండి

Prostitution Case: వ్యభిచారం కేసులో విటులు కూడా నేరం చేసినట్టే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Big Stories

×