పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనే కోరిక ఉన్నా, ఎలా వెళ్లాలో తెలియక, ఖర్చు ఎక్కువ అవుతుందేమోననే అనుమానంతో వెళ్లలేకపోతున్నారు. వీరి కోసం భారతీయ రైల్వే ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తుంది. తక్కువ ఖర్చులో తమకు ఇష్టమైన పుణ్యక్షేత్రాలకు వెళ్లే అవకాశం కల్పిస్తోంది. ఈ నెలలో మరో అద్భుతమైన ప్యాకేజీ తీసుకొచ్చింది. ఏడు పవిత్ర జ్యోతిర్లింగాలను సందర్శించే యాత్రికుల కోసం.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్యాకేజీని ప్రకటించింది. 12 రోజుల పాటు ఈ ప్రయాణం కొనసాగనుంది. నవంబర్ 18న యోగ నగరి రిషికేశ్ రైల్వే స్టేషన్ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్రకు సంబంధించిన బుకింగ్ ప్రారంభం అయినట్లు అధికారులు వెల్లడించారు.
IRCTC జ్యోతిర్లింగ ప్యాకేజీలో భాగంగా భారత్ గౌరవ్ రైలు ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, నాగేశ్వర్, సోమనాథ్, త్రయంబకేశ్వర్, భీమశంకర్, గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలను కవర్ చేస్తుంది. అదనపు స్టాప్ లలో ద్వారకాధీష్ ఆలయం, బెట్ ద్వారక కూడా ఉంటాయని IRCTC అధికారులు వెల్లడించారు.
పర్యటన సమయం: 11 రాత్రులు/12 రోజులు (నవంబర్ 18–29).
యాత్ర మొదలయ్యే ప్రదేశం: యోగ నగరి రిషికేశ్ నుంచి భారత్ గౌరవ్ రైలు ప్రారంభం అవుతుంది. హరిద్వార్, లక్నో, కాన్పూర్, ఇతర స్టేషన్లలో బోర్డింగ్ ఆప్షన్లు ఉన్నాయి.
జ్యోతిర్లింగాల దర్శనానికి తీసుకెళ్లే భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు 767 మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది
కంఫర్ట్ (2AC) – వ్యక్తికి రూ. 54,390
స్టాండర్డ్ (3AC) – వ్యక్తికి రూ. 40,890
ఎకానమీ (స్లీపర్) – వ్యక్తికి రూ. 24,100 ఛార్జ్ చేయనున్నట్లు IRCTC అధికారులు తెలిపారు.
ఇక పర్యటన సమయంలో ప్రయాణీకులకు శాఖాహార భోజనం, హోటల్, ధర్మశాల బసలు, గైడెడ్ సందర్శనలు, ప్రయాణ బీమా, టూర్ ఎస్కార్ట్ లు అందిస్తారు.
IRCTC భారత్ గౌరవ్ ప్యాకేజీ ప్రయాణం భోజనం నుంచి వసతి వరకు అన్ని ఏర్పాట్లను కవర్ చేస్తుంది. ప్రయాణీకుల మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా తీర్థయాత్ర చేసే అవకాశం కల్పిస్తుంది. భారత్ గౌరవ్ పథకం కింద 33% వరకు రాయితీ లభిస్తుంది. ఈ ప్రయాణం భక్తులకు దేశంలోని అత్యంత గౌరవనీయమైన శివాలయాలను సులభంగా, సౌకర్యంగా దర్శించుకునే అవకాశం కల్పిస్తుంది.
Read Also: అబ్బా.. ఎవరీ హ్యాండ్సమ్.. నెట్టింట వైరల్ అవుతున్న రైల్వే టీసీ వీడియో!
ఇక జ్యోతిర్లింగ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు IRCTC అధికారిక వెబ్ సైట్, అధీకృత అవుట్ లెట్ల ద్వారా టికెట్ ను బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రయాణీకులు బోర్డింగ్ సమయంలో చెల్లుబాటు అయ్యే ID ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది.
Read Also: ప్రయాణీకుల భద్రతకు రైల్వే కీలక నిర్ణయం, ఇక కోచ్ లలోనూ సీసీ కెమెరాలు!