PSL 2026: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంది. నసీమ్ షా పెట్టిన వివాదాస్పద పోస్టు నుంచి మొదలుకొని డేవిడ్ వార్నర్ డ్రంక్ అండ్ డ్రైవ్, అరెస్ట్ వరకు అన్ని వివాదాలే. మ్యాచ్ జరిగితే చాలు ఏదో ఒక వివాదంశం తెరపైకి వస్తోంది. అయితే లేటెస్ట్ గా మరో అంశం హాట్ టాపిక్ అయింది. ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడే ప్లేయర్లు నడిరోడ్డు పైన నడుచుకుంటూ కనిపించారు. బస్సు ఫెసిలిటీ ఏర్పాటు చేయకపోవడంతో హోటల్ నుంచి స్టేడియం వరకు నడుచుకుంటూ వెళ్లారు మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan), ఇతర రావాల్పిండిజ్ జట్టుకు ( Rawalpindiz Cricket Team) సంబంధించిన ప్లేయర్లు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ లో పెట్రోల్ కొరత ( Petrol shortage) ఉందని, అందుకే ఈ పరిస్థితి నెలకొందని పరువు తీస్తున్నారు.
Also Read: IPL LED Stumps: ఐపీఎల్ లో వాడే LED వికెట్లు ఇంత ఖరీదైనవా ? ఆ డబ్బులతో 4 SUV కార్లు కొనచ్చు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు పోటీగా కొనసాగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో రోజుకో వివాదం రాజు కుంటోంది. మ్యాచ్ జరిగితే చాలు పరుగుల కంటే వివాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ కొరత ఉన్న సంగతి తెలిసిందే. కానీ పాకిస్తాన్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ పెట్రోల్ కొరత ఎఫెక్ట్ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఆడే ప్లేయర్ల పైన పడింది. పెట్రోల్ కొరత ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడే ప్లేయర్లు నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
వాళ్ల కోసం నడిచే బస్సుల్లో పెట్రోలు పోయించలేని పరిస్థితిలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధం కారణంగా పాకిస్తాన్ లో పెట్రోల్ ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ధరలు పెరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై అదనపు భారం పడుతోంది. అందుకే బస్సులు నడిపించలేక, బస చేసే హోటల్స్ నుంచి స్టేడియాల వరకు ప్లేయర్లను నడిపిస్తున్నారు. ఇందులో భాగంగానే మహమ్మద్ రిజ్వాన్, రావాల్పిండిజ్ జట్టుకు ( Rawalpindiz Cricket Team) సంబంధించిన ప్లేయర్లు నడుచుకుంటూ స్టేడియానికి వెళ్లిన వీడియోలు వైరల్ గా మారాయి. అయితే ఇలా నడుచుకుంటూ వెళ్లే క్రమంలో మసీద్ కు కూడా రిజ్వాన్ వెళ్లినట్లు చెబుతున్నారు. మసీద్ దగ్గర దాకా వెళ్లి నమాజ్ చేసుకున్న తర్వాత స్టేడియానికి వెళ్ళాడట. ఈ న్యూస్ కూడా హార్ట్ టాపిక్ అయింది.
Also Read: SRH జట్టులో చీలిక.. తెలంగాణ, ఏపీ ఫ్యాన్స్ మధ్య కొత్త పంచాయితీ..తలపట్టుకున్న కావ్య పాప
For Mohammad Rizwan – Maksad important hai, cricket nhi 🤪 https://t.co/9vqpOXj0BW
— Ajay Jadeja (@AjayJadeja171) April 18, 2026