E-Paper
Advertisement

t20 : ఫైనల్ కి పాకిస్తాన్.. మళ్లీ దాయాదుల పోరు?

t20 : ఫైనల్ కి పాకిస్తాన్.. మళ్లీ దాయాదుల పోరు?
Advertisement

t20 : టీ20 వాల్డ్ కప్ దుమ్మురేపుతోంది. ఉత్కంఠ మ్యాచ్ లతో సంచలనాలు క్రియేట్ చేస్తోంది. సెమీస్ లో న్యూజిలాండ్ ను ఓడించి పాకిస్తాన్ ఫైనల్ కు దూసుకెళ్లడంతో.. క్రికెట్ ఫీవర్ మరింత పెరిగిపోయింది. గురువారం ఇంగ్లాండ్ తో సెమీస్ లో ఇండియా గెలిస్తే.. ఫైనల్లో మళ్లీ దాయాదుల పోరు తప్పదు. అబ్ ఆయేగా మజా.

టీ20 ప్రపంచకప్‌లో తొలి సెమీస్‌లో కివీస్ పై పాకిస్థాన్‌ విజయం సాధించింది. న్యూటిలాండ్ 153 రన్స్ టార్గెట్ ఇవ్వగా.. పాక్ చాలా ఈజీగా ఛేజ్ చేసింది. డక్కామొక్కీలు తింటూ సెమీస్ వరకూ వచ్చిన పాకిస్తాన్.. ఇప్పుడే ఏకంగా ఫైనల్లోకి ఎంటర్ అవడం షాకింగ్ విషయమే.

Advertisement

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్ 152/4 స్కోరు చేసింది. డారిల్ మిచెల్ (53) అర్ధశతకం చేయగా.. కేన్ విలియమ్సన్ (46) రాణించాడు. ఫిన్‌ అలెన్ (4) తొందరగానే అవుట్ అవగా.. డేవన్ కాన్వే (21), జేమ్స్‌ నీషమ్ (16) స్కోరును పెంచారు. పాక్‌ బౌలర్లలో షహీన్ షా అఫ్రిది 2, మహమ్మద్ నవాజ్‌ ఒక వికెట్‌ తీశారు.

ఆ తర్వాత ఛేజింగ్ కు వచ్చిన పాకిస్తాన్.. మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.1 ఓవర్లలో 153 పరుగులు చేసి ఫైనల్ కి దూసుకెళ్లింది. ఓపెనర్లు మహమ్మద్ రిజ్వాన్ (57), బాబర్ అజామ్ (53) హాఫ్ సెంచరీలు చేశారు. మహమ్మద్ హారిస్‌ (30) రన్స్ తో మెప్పించాడు. కివీస్‌ బౌలర్లలో బౌల్ట్‌ 2, మిచెల్ సాంట్నర్ ఒక వికెట్ తీశారు.

Advertisement

గురువారం భారత్-ఇంగ్లాండ్‌ మధ్య సెమీఫైనల్‌ జరగనుంది. అందులో గెలిచిన జట్టు ఫైనల్లో పాకిస్తాన్ తో తలపడనుంది. సెమీస్ లో ఇండియానే గెలవాలని.. ఫైనల్లో పాకిస్తాన్ ను మరోసారి కసితీరా ఓడించాలని భారత అభిమానులంతా కోరుకుంటున్నారు. కమాన్ ఇండియా…

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×