Shahid Afridi comments: టీమిండియా కొత్త కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను తీసుకుంది బీసీసీఐ. ఆయన ఎంపికపై చాలా కసరత్తు చేసింది. ఆయన పెట్టిన షరతులకు ఆమోదం తెలిపింది. ఈ విషయంలో ఆయనకు కొంత ఫ్రీడమ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తనకు సహాయకులుగా నచ్చినవారిని తీసు కోవచ్చు. టీమిండియా కోచ్ గంభీర్‌పై పలు దేశాల మాజీ క్రికెటర్లు రియాక్టు అయ్యారు.
తాజాగా పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహీద్ అఫ్రిది మనసులోని మాట బయటపెట్టాడు. టీమిండియా కోచ్‌గా గౌతమ్ గంభీర్‌కు గొప్ప అవకాశం దక్కిందన్నాడు. ఆయనంటే తనకు ఇష్టమని చెబుతూనే, ఆట విషయం లో గంభీర్ ముక్కుసూటిగా వ్యవహరిస్తాడన్నాడు. ఈ అవకాశాన్ని గంభీర్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలన్నాడు. ఆయన ఇంటర్వ్యూలు చాలావరకు చూశానని వెల్లడించాడు.
పనిలోపనిగా టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లి గురించి నోరువిప్పాడు అఫ్రిది. కోహ్లి పాకిస్థాన్ వస్తే.. భారత్ ఆతిథ్యాన్ని మరిచిపోతాడని చెప్పుకొచ్చాడు అఫ్రిది. ఆయనకు పాక్‌లో చాలామంది అభిమానులు ఉన్నారని, తమ దేశంలో విరాట్ ఆడటాన్ని చూడాలని తాము ఆసక్తిగా ఉన్నామన్నాడు.
ALSO READ: వింబుల్డన్ ఫైనల్.. జాస్మిన్‌తో క్రెజికోవా ఢీ.. దాదాపు మూడుగంటల పాటు..
అటు దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ డేల్ స్టెయిన్ కూడా గంభీర్‌పై ప్రశంసలు కురిపించాడు. టీమిండియా కోచ్‌గా ఆయనను నియమించడం చాలా హ్యాపీగా ఉందన్నాడు. దూకుడు స్వభావానికి తాను అభిమాని అని వ్యాఖ్యానించాడు.
టీమ్‌ఇండియా బౌలింగ్ కోచ్ రేసులో రోజుకో ఆటగాడి పేరు బలంగా వినిపిస్తోంది. సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ మోర్కెల్ ఈ లిస్టులో చేరాడు. ఆయన పాక్‌తోపాటు ఐపీఎల్, ఎల్‌ఎస్జీ కోచ్‌గా పని చేశాడు. మరి స్వదేశీ కోచ్ వైపు బీసీసీఐ మొగ్గు చూపుతుందా? లేక ఫారెన్ వైపు చూస్తుందా అనేది చూడాలి. ఇండియా నుంచి బాలాజీ, జహీర్‌ఖాన్, వినయ్‌కుమార్ ఈ రేసులో ఉన్నట్లు వార్తలొచ్చాయి.