BigTV English

Jasmine Paolini reached final: వింబుల్డన్ ఫైన‌ల్‌.. జాస్మిన్‌తో క్రెజికోవా ఢీ.. దాదాపు మూడుగంటల పాటు..

Jasmine Paolini reached final: వింబుల్డన్ ఫైన‌ల్‌.. జాస్మిన్‌తో క్రెజికోవా ఢీ.. దాదాపు మూడుగంటల పాటు..

Jasmine Paolini reached final: వింబుల్డన్ టోర్నమెంటు ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంటోంది. తాజాగా మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ఇటలీ అమ్మాయి జాస్మిన్ పావోలిని-క్రెజికోవాతో తలపడనుంది. టైటిల్‌పై ఇద్దరు అమ్మయిలు కన్నేశారు.


లండన్ వేదికగా గురువారం మహిళ సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఇటలీ బ్యూటీ జాస్మిన్ పావోలిని- క్రొయేషియాకు చెందిన డోనా వెకిక్ మధ్య నువ్వానేనా అన్నట్లు పోరు సాగింది. వీరిద్దరి మధ్య దాదాపు రెండు గంటల 51 నిమిషాల సేపు మ్యాచ్ సాగింది. వింబుల్డన్ హిస్టరీలో ఇదొక రికార్డుగా చెబుతున్నారు.

క్రొయేషియా ప్లేయర్ డోనా వెకిక్‌పై ఇటలీ బ్యూటీ జాస్మిన్ సంచలన విజయం సాధించింది. మూడు సెట్ల ను 2-6, 6-4, 7-6 విజయం సాధించి ఫైనల్‌‌లో అడుగుపెట్టింది జాస్మిన్. మ్యాచ్ ప్రారంభం నుంచి ఇరువురు ఆటగాళ్లు నువ్వానేనా అన్నరీతిలో తలపడ్డారు. మైదానంలో ప్రేక్షకుల నుంచి ఇరువురు ఆటగాళ్లకు మాంచి మద్దతు లభించింది.


ALSO READ: టీమిండియా శ్రీలంక పర్యటన.. షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ

తొలిపాయింట్ సాధించుకోవడానికి జాస్మిన్ పావోలిని దాదాపు ఏడు నిమిషాలు పట్టింది. ప్రత్యర్థి క్రొయేషియా బ్యూటీ డోనా వెకిక్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఇరువురు ఆటగాళ్లు చెరో సెట్‌ను గెలుచుకున్నారు. మూడో సెట్ ఇరువురు ఆటగాళ్లకు కీలకంగా మారింది. ఇద్దరి ప్లేయర్స్‌కు సమానంగా పాయింట్లు రావడంతో మ్యాచ్ టై బ్రేక్ దారితీసింది.

ఫస్టాప్‌లో డోనా వెకిక్‌ పైచేయి సాధించింది. ఇక జాస్మిన్ పనైపోయిందని భావించారు. అభిమానుల్లో ఆశలు సన్నగిల్లాయి. అనూహ్య రీతిలో పుంచుకున్న జాస్మిన్ దూకుడుగా ఆడింది. ప్రత్యర్థికి సమానంలో పాయింట్లు రావడంతో డోనా వెకిక్ నిరాశకు లోనవుతోంది. పరిస్థితి గమనించిన జాస్మిన్ అదే దూకుడు కంటిన్యూ చేసింది. చివరకు జాస్మిన్ ధాటికి డోనా వెకిక్ తలవంచింది. ఫలితంగా మైదానంలో కంటతడి పెట్టింది.

జాస్మిన్ పావోలిని ఐడు ఏస్‌లు, 26 విన్నర్లు కొట్టింది. అయితే ప్రత్యర్థి వెకిక్ ఏడు ఏస్‌లు, 42 విన్నర్లు కొట్టింది. కాకపోతే 57 అనవసర తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుంది. పావోలిని కేవలం 32 అనవసర తప్పిదాలే మాత్రమే చేసింది.

మరో రికార్డు ఏంటంటే… 2016లో ఒకే సీజన్‌లో ఫ్రెంచ్, వింబుల్డన్ ఫైనల్‌కు చేరింది సెరీనా విలియమ్స్ . ఇప్పుడు ఇటలీ బ్యూటీ జాస్మిన్ పావోలిని ఆ రికార్డును సమం చేసింది. గత నెలలో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో స్వైటెక్ చేతిలో ఓడిపోయింది. వింబుల్డన్‌లో ఫైనల్ చేరింది.

 

Tags

Related News

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

Big Stories

×