ఝార్ఖండ్ రాజధాని రాంచీలో దుర్గాదేవి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా బక్రి బజార్ లోని అమ్మవారి మండపం నిర్మాణం దేశ వ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రతి ఏటా ఒక్కో ఆలయ రూపంలో ఇక్కడి మండపాన్ని నిర్మిస్తారు. ఈ మండపం నిర్మాణం కోసం నిర్వాహకులు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారు. ప్రపంచ ప్రఖ్యాత శిల్పులను తీసుకొచ్చి ఈ మండపం నిర్మాణం, అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయిస్తారు. ఎప్పటి లాగే ఈ ఏడాది కూడా దుర్గా పూజ దగ్గర పడుతుండటంతో మండపం నిర్మాణ ప్రక్రియ చివరి దశకు చేరుకుంటోంది.
రాంచీ బక్రి బజార్ లో తయారు చేస్తున్న పూజ మండపం ఈసారి భక్తులను మరింత ఆకట్టుకోనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయమైన కంబోడియాలోని అంగ్కోర్ వాట్ ఆలయం తరహాలో పండల్‌ను రెడీ చేస్తున్నారు. భారతీయ యువక్ సంఘ్ బక్రి బజార్ అధ్యక్షుడు రాహుల్ అగర్వాల్ పర్యవేక్షణలో ఈ పనులు కొనసాగుతున్నాయి. ఈ మంపడపం అధికారిక ప్రారంభోత్సవం సెప్టెంబర్ 26న జరుగుతుంది. దాదాపు 14, 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మండపం సిద్ధం అవుతోంది. బక్రి బజార్ లో ఇప్పటివరకు నిర్మించిన అతిపెద్ద మండపంగా ఇది గుర్తింపు తెచ్చుకోనుంది. పూజ మండపం నిర్మాణంలో అన్ని సహజ వస్తువులను ఉపయోగించారు. పాత్ కాథి, మలై కాథి, హోగ్లా ఆకు, తాటి ఆకు, బూలెన్ తాడు, త్రిపుర చాప, త్రిపుర మదుర్ కాథి, ఇతర వస్తువులు ఉన్నాయి.
దుర్గా పూజ మండపం నిర్మాణం దాదాపు మూడు నెలలుగా కొనసాగుతోంది. దీనిలో దుర్గా మాత విగ్రహాన్ని పశ్చిమ బెంగాల్ కు చెందిన అనుప్ దా తయారు చేస్తున్నారు. విగ్రహం వెడల్పు 36 అడుగులు, ఎత్తు దాదాపు 26 అడుగులు ఉంటుందని పూజీ కమిటీ సభ్యుడు సంజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత కళాకారుడు గోరంగో కోయెలి దుర్గాపూజ మండప నిర్మాణాన్ని చూసుకుంటున్నారు.
Read Also: హైదరాబాద్ నుంచి కేవలం 8 గంటల జర్నీ.. స్వర్గాన్ని తలపించే ఈ ఆలయానికి వెళ్లాలని ఉందా?
దుర్గా పూజా మండపం ఎత్తు దాదాపు 110 అడుగులు ఉంటుంది. మండపం పూర్తిగా వాటర్ రెసిస్టెంట్ గా నిర్మిస్తున్నారు. పూజ మండపానికి ఈసారి సుమారు రూ. 90 లక్షలు ఖర్చు చేస్తున్నారు. రాజమౌళి సినిమా సెట్టింగును తలపించే రూపొందిస్తున్నారు. ఇది ప్రజల నుంచి సేకరించిన విరాళాల ద్వారా నిర్మిస్తున్నారు. మండపాన్ని సందర్శించే భక్తుల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా బాధ్యతను స్థానిక పరిపాలన, పూజ కమిటీతో అనుబంధించబడిన స్వచ్ఛంద సేవకులు తీసుకుంటారు. మొత్తంగా ఈసారి రాంచీ బక్రి బజార్ లో దుర్గాదేవి పూజ సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి.
Read Also: అక్కడ రైళ్లు ఆకాశాన్ని తాకుతాయి, అమ్మో ఆ స్టేషన్ అంత ఎత్తులో ఉందా?