BigTV English

Pakistan Team 2023 : పాకిస్తాన్ కి సెమీస్ ఆశలు ఇంకా ఉన్నాయా? లెక్కలివే..?

Pakistan Team 2023 : పాకిస్తాన్ కి సెమీస్ ఆశలు ఇంకా ఉన్నాయా? లెక్కలివే..?
Pakistan

Pakistan Team 2023 : వన్డే వరల్డ్ కప్ 2023లో ఏ నిమిషానికేం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోతున్నారు. ఓడిపోయే మ్యాచ్ లు గెలుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సెమీస్ ఆశలు క్లిష్టం చేసుకున్న పాకిస్తాన్ ఆశలు అక్కడక్కడ మిణుకు మిణుకు మంటూ మెరుస్తున్నాయి.


ఇలా జరిగితే, అలా జరగొచ్చు, అలా జరిగితే ఇలా జరగొచ్చు, వాళ్లు ఓడిపోవాలి. వీళ్లు గెలవాలి…ఒకప్పుడు ఇండియా జట్టు విషయంలో 140 కోట్లమంది ఇండియన్స్ ఇలాంటి లెక్కల్లో బిజీగా ఉండేవారు. మెగా టోర్నమెంట్ అయ్యేవరకు ఎదురుచూసేవారు. ఇప్పుడా పరిస్థితి పాకిస్తాన్ కి వచ్చింది.

ఆరు మ్యాచ్ లు ఆడిన పాకిస్తాన్ రెండు గెలిచింది. వరుసగా నాలుగు ఓడిపోయి వరల్డ్ కప్ లో ఒక చెత్త రికార్డ్ ను కూడా నమోదు చేసింది. ఇలా 4 పాయింట్లతో టేబుల్ లో ఆరో స్థానంలో ఉంది. ఇంకా తను మూడు మ్యాచ్ లు బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ పై ఆడాల్సి ఉంది. అయితే బంగ్లాదేశ్, ఇంగ్లండ్ పై గెలిచే అవకాశాలున్నాయి. ఇంగ్లండ్ ఆడుతున్న తీరే అందుకు నిదర్శనం. న్యూజిలాండ్ మీద కష్టపడి గెలిస్తే 10 పాయింట్లు వస్తాయి. అయితే రన్ రేట్ కూడా గట్టిగా ఉండాలి.
ప్రస్తుతం టాప్ 4లో సౌతాఫ్రికా, ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఉన్నాయి.
ఇప్పుడు పాకిస్తాన్ కి కలిసి వచ్చే అంశాలేమిటంటే…
న్యూజిలాండ్ మీద గెలిచిన ఆస్ట్రేలియా 8 పాయింట్లతో అలాగే ఉండాలి. మిగిలిన మ్యాచ్ ల్లో ఓడిపోవాలి.
న్యూజిలాండ్ 8 పాయింట్లతో ఉంది. ఇక్కడ నుంచి అన్నింట్లో ఓడిపోవాలి.
శ్రీలంక, ఆఫ్గనిస్తాన్ చెరో నాలుగు పాయింట్లతో ఉన్నాయి.
ఈ రెండు టీమ్ లు కూడా 8 పాయింట్లను దాటకూడదు.
అప్పుడు పాకిస్తాన్ అన్నింటా గెలిచి 10 పాయింట్లతో…రన్ రేట్ తో సంబంధం లేకుండా సెమీస్ కి వెళుతుంది.
లేదు…మిగిలిన వాళ్లు కూడా 10 పాయింట్ల వరకు వస్తే మాత్రం
రన్ రేట్ కీలకం అవతుంది.
అప్పుడు పాకిస్తాన్ దొరికిపోవచ్చునని అంటున్నారు.
ఎందుకంటే అటు ఆసిస్, ఇటు న్యూజిలాండ్ భారీ స్కోర్స్ కొడుతున్నారు. ఇవన్నీ సజావుగా సాగిన తర్వాత…ఇండియా కూడా కొంత సహకరించాలి.
ఎందుకంటే పొరపాటున కూడా ఇండియా 3 స్థానంలోకి రాకూడదు.
టాప్ 2లోనే ఉండాలి. ఈ అసాధ్యాలన్నీ సుసాధ్యాలైతే పాకిస్తాన్ సెమీస్ కి వెళుతుందని క్రీడా పండితులు లెక్కలేస్తున్నారు.


Related News

IND VS PAK Final: ఇండియాను వ‌ణికిస్తున్న పాత రికార్డులు..అదే జ‌రిగితే పాకిస్థాన్ ఛాంపియ‌న్ కావ‌డం పక్కా ?

IND Vs PAK : నోరు జారిన షోయబ్ అక్తర్.. అభిషేక్ బచ్చన్ ను సీన్ లోకి లాగి

IND VS PAK, Final: ట్రోఫీ ఇవ్వ‌నున్న‌ నఖ్వీ.. వాడిస్తే మేం తీసుకోబోమంటున్న టీమిండియా..!

IND Vs PAK : ‘షేక్ హ్యాండ్’ వివాదం పై పాకిస్తాన్ కెప్టెన్ మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

NEP-WI : నేపాల్ సరికొత్త చరిత్ర.. వెస్టిండీస్ జట్టుపై చారిత్రాత్మక విజయం 18వ ర్యాంక్ లో ఉండి వణుకు పుట్టించింది

IND vs PAK Final: నేడు ఆసియా క‌ప్‌ ఫైన‌ల్స్‌..పాండ్యా దూరం..టెన్ష‌న్ లో టీమిండియా, టైమింగ్స్‌..ఉచితంగా ఎలా చూడాలి

Asia Cup 2025 : టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్ లో గెలిచేదెవ‌రు..చిలుక జోష్యం ఇదే

IND Vs PAK : ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్… బీసీసీఐ సంచలన నిర్ణయం.. బాయ్ కాట్ చేస్తూ

Big Stories

×