IND Vs PAK : ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. ప్రపంచంలో అత్యంత హై వోల్టేజ్ ఉండే మ్యాచ్ ఏదైనా ఉందంటే..? అది పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా అనే చెప్పవచ్చు. టీమిండియా వైస్ కెప్టెన్, ఓపెనర్ శుబ్ మన్ గిల్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగనున్నట్టు సమాచారం. ప్రాక్టీస్ సమయంలో నిన్న శుబ్ మన్ గిల్ గాయపడ్డట్టు తెలుస్తోంది. త్రో డౌన్ స్పెషలిస్ట్ బౌలింగ్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. బంతి గిల్ చేతికి బలంగా తాకింది. దీంతో గిల్ వెంటనే నొప్పితో విలవిల్లాడు. ఆ తరువాత ఫిజియో వచ్చి అతనికి ఐస్ ప్యాక్స్ పెట్టి చికిత్స అందించాడు. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక తిరిగి గిల్ తన ప్రాక్టీస్ ను కొనసాగించాడు.
ఇక ఇప్పటికే రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సమయంలో ఈ మ్యాచ్ జరుగుతుండటంతో ఇంకా హై.. హై వోల్టేజ్ పెరిగిందనే చెప్పాలి. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న మ్యాచ్ పై క్రికెట్ అభిమానులు ఇంకెప్పుడు రాత్రి 8 గంటలు అవుతుందని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరగా 8 గంటలు అయితే బాగుండు అని పేర్కొంటున్నారు. ముఖ్యంగా సరిహద్దు ఉద్రిక్తతలు, వివాదాలు, విభేదాలు, విమర్శలు ఎన్ని ఉన్నా క్రికెట్ మైదానానికి వచ్చే సరికి ఈ మ్యాచ్ ఫలితం పై అందరి దృష్టి పడుతుంది. పహల్గామ్ ఘటనను దృష్టిలో ఉంచుకొని మ్యాచ్ ను బాయ్ కాట్ చేయాలని చాలా మంది పిలుపులు ఇచ్చినా.. క్రికెటర్లు, నిర్వాహకులు, ప్రసారకర్తలు తమ పని తాము చేసుకుంటూ మ్యాచ్ కి ప్రచారం చేశారు. వాస్తవానికి ఆసియా కప్ లో మొత్తం లీగ్ దశలో 12 మ్యాచ్ లు జరుగుతాయి. మిగతా 11 మ్యాచ్ లపై ఉన్న ఆసక్తి.. ప్రేక్షకుల స్పందన చూసినట్టయితే అంతగా ఏమి ఉండదు. కానీ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య పోరు మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులకు పుల్ ఎంటర్టైన్ మెంట్ ఇవ్వనుంది. ప్రధానంగా భారత్ తరపున సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నిష్క్రమించగా.. పాకిస్తాన్ జట్టుకు బాబర్, రిజ్వాన్ దూరమయ్యారు.
ఆసియా కప్ టోర్నీలో తొలి మ్యాచ్ లో ఆడిన టీమిండియానే అదే జట్టును కొనసాగించనున్నట్టు సమాచారం. పాకిస్తాన్ కూడా ఒమన్ తో ఆడిన జట్టునే కొనసాగించనుంది. దీంతో ఇరు జట్ల మధ్య జరిగే పోరు ఇప్పుడు ఆసక్తికరంగా మారనుంది. టీమిండియా కి అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి వంటి స్పిన్నర్లు, బుమ్రా, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే వంటి ఫాస్ట్ బౌలర్లు పాక్ ని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించనున్నారు. బ్యాటింగ్ పరంగా చూసినట్టయితే టీమిండియా 5గురు బ్యాటర్లు, 3 ఆల్ రౌండర్లు మొత్తం 8 మంది బ్యాటింగ్ ని అద్భుతంగా చేస్తారు. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలో టీమిండియా అద్భుతంగా రాణిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా అని పాకిస్తాన్ ని కూడా తక్కువ అంచెనా వేయలేము. ఇవాళ రాత్రి 8 గంటలకు జరిగే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి మరీ.
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ వర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వరుణ్ చక్రవర్తి.
సల్మాన్ అలీ అఘా (కెప్టెన్)ఫర్హాన్, అయూబ్, ఫఖర్ జమాన్, హాసన్, హారిస్, నవాజ్, ఫహీమ్, అఫ్రిది, ముఖీమ్, అబ్రార్.