BigTV English

PAK vs IRE HighlightsT20 World Cup 2024: పడుతూ లేస్తూ.. పాక్ ని గెలిపించిన.. బాబర్

PAK vs IRE HighlightsT20 World Cup 2024: పడుతూ లేస్తూ.. పాక్ ని గెలిపించిన.. బాబర్

Pakistan vs Ireland Highlights T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ లో నామమాత్రమైన ఆఖరి మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్ మధ్య జరిగింది. చాలా ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ లో పాకిస్తాన్ చిన్నజట్టుపై చివరి వరకు పోరాడి గెలిచింది. ఇక్కడ కూడా ఒక సంచలనం నమోదవుతుందని అంతా అనుకున్నారు. అయితే బాబర్ అజామ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి టెయిల్ ఎండర్స్ తో కలిసి మ్యాచ్ ను గెలిపించి, బతుకు జీవుడా అని స్వదేశానికి బయలుదేరాడు.


టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగు తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగుకి వచ్చిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ పడుతూ లేస్తూ 18.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసి.. విజయం సాధించింది.

107 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ ఆటగాళ్లలో నిరాశ నిస్ప్రహలు అలముకున్నాయి. సూపర్ 8కి చేరకపోవడంతో ఆ దేశ ప్రజలు, సీనియర్ల నుంచి వచ్చే నిరసనలు, అవమానాలు తట్టుకోలేక, లోలోపలే కుమిలిపోయినట్టు అంతా కనిపించారు. ఒక్కరి ముఖాల్లో సంతోష లేదు. అదే ఫీల్ తో బ్యాటింగ్ కి రావడం వల్ల వారి బ్యాటింగు తడబడుతూ ముందుకు సాగింది.


ఒక దశలో 11 ఓవర్లు గడిచేసరికి 62 పరుగులకి 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఓపెనర్లు ఇద్దరు రిజ్వాన్, సాయిబ్ ఆయుబ్ ఇద్దరూ చెరో 17 పరుగులు చేసి అవుట్ అయ్యారు. తర్వాత జట్టు పేకమేడలా కూలిపోయింది.

Also Read: గౌతం గంభీర్ టీమ్ ఇండియా కోచ్.. ఇది ఫిక్స్ !

మొదట్లో పవర్ ప్లే ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 52 పరుగులతో పటిష్టంగా కనిపించిన పాకిస్తాన్ తలరాత ఒక్కసారి మారిపోయింది. ఎట్టకేలకు కెప్టెన్ బాబర్ (32) బాధ్యతలను భుజాలపై వేసుకుని ఒంటరిపోరాటం చేశాడు. అబ్బాస్ ఆఫ్రిది (17), షహీన్ ఆఫ్రిది (13 నాటౌట్) సాయంతో జట్టుని గెలుపుతీరాలకు చేర్చాడు.

ఐర్లాండ్ బౌలింగులో మార్క్ అడైర్ 1, బార్రి 3, బెంజిమిన్ 1, కర్టిస్ 2 వికెట్లు పడగొట్టారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×