IND Vs PAK : ఆసియా కప్ 2025లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య లీగ్ దశలో ప్రస్తుతం మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టాస్ ఓడిపోయినప్పటికీ టీమిండియా ఫీల్డింగ్ చేస్తోంది. దీంతో పాకిస్తాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఒమన్ తో ఆడిన జట్టునే పాకిస్తాన్ ప్రకటించింది. టీమిండియా కూడా ఎలాంటి మార్పులు లేకుండానే జట్టును యూఏఈతో ఆడిన జట్టునే ప్రకటించేసింది. దీంతో రెండు జట్లు బలంగానే కనిపిస్తున్నాయి. మరోవైపు పహల్గామ్ దాడి బాధితులు సహా పలువురు భారతీయ అభిమానులు ఇప్పటికీ కూడా పాకిస్తాన్ తో ఇండియా ఆడొద్దని కోరుకుంటున్నారు. అయినప్పటికీ భారత ఆటగాళ్లకు బీసీసీఐ అనుమతిచ్చింది.
Also Read : IND VS PAK : ఇదే జరిగితే…ఆసియా కప్ నుంచి టీమిండియా ఎలిమినేట్ ?
పాకిస్తాన్ తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరూ పాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగింది. స్పీడ్ స్టార్ హారిస్ రౌఫ్ మరోసారి బెంచ్ కే పరిమితమయ్యాడు. మరోవైపు భారత్ కూడా తమ ప్లేయింగ్ ఎలెవన్ లో ఎలాంటి మార్పులు లేకుండా ఆడుతోంది. ప్రాక్టీస్ సెషల్ గాయపడిన శుబ్ మన్ గిల్ పూర్తి పిట్ నెస్ సాధించాడు. దీంతో శుబ్ మన్ గిల్ కు తుదిజట్టులో చోటు దక్కింది. ఇవాళ ఉదయం నుంచి శుబ్ మన్ గిల్ పాకిస్తాన్ తో మ్యాచ్ కి దూరం అవుతాడనే వార్తలు వినిపించిన విషయం విధితమే. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ స్పిన్నర్లుగా ఉండగా.. జస్ప్రీత్ బుమ్రా ఫ్రంట్ లైన్ పేసర్ గా ఉన్నాడు. బుమ్రాతో పాటు ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే బౌలింగ్ చేయనున్నారు.
తొలుత టాస్ గెలవగానే పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా తొలుత బ్యాటింగ్ ఎంచుకోగానే..టీమిండియా అభిమానులు ఒక్కసారిగా సంతోషం వ్యక్తం చేశారు. వాస్తవానికి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా టాస్ విజయం సాధిస్తే.. ఫీల్డింగ్ ఎంచుకోవాలని భావించాడు. టాస్ ఓడిపోయినప్పటికీ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో టీమిండియా అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. తొలుత ఫీల్డింగ్ చేయడంతో తక్కువ స్కోర్ కే కట్టడి చేస్తే.. బ్యాటింగ్ ఈజీ అవుతుందని టీమిండియా భావిస్తే.. తొలుత భారీ స్కోర్ చేసి.. ఆ తరువాత భారత్ ను కట్టడి చేయవచ్చని పాకిస్తాన్ భావించింది. కానీ టీమిండియా పేవరేట్ గా బరిలోకి దిగింది. టాస్ ఓడిపోయినప్పటికీ.. జట్టు విజయం సాధిస్తుందని టీమిండియా అభిమానులు పేర్కొంటున్నారు.
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ వర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వరుణ్ చక్రవర్తి.
సల్మాన్ అలీ అఘా (కెప్టెన్)ఫర్హాన్, అయూబ్, ఫఖర్ జమాన్, హాసన్, హారిస్, నవాజ్, ఫహీమ్, అఫ్రిది, ముఖీమ్, అబ్రార్.