Grace Hayden : ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్లు ఆడే యాషెస్ సిరీస్ కి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దాదాపు 141 సంవత్సరాల చరిత్ర గల ఈ సిరీస్ లో మరోసారి ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. యాషెస్ సిరీస్ 2025 నవంబర్ నుంచి జనవరి 08, 2026 వరకు జరుగుతుంది. అత్యంత ప్రతిష్టాత్మక సిరీస్ కి ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది. ఈ సిరీస్ ప్రారంభానికి రెండు నెలలకు పైగా సమయం ఉన్నప్పటికీ.. మాజీ క్రికెటర్లు మాత్రం తమ సవాల్ తో మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కూతురు కూడా కామెంట్స్ చేసింది.
Also Read : Ind Vs Pak : మరికొద్ది గంటల్లోనే భారత్-పాక్ మ్యాచ్.. భారత్ బలాలు, బలహీనతలు ఇవే..!
యాసెస్ టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ ఇప్పటివరకు ఆస్ట్రేలియా ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు. దీంతో మాథ్యూ హెడెన్.. రూట్ ఆస్ట్రేలియాలో తొలిసారి సెంచరీ చేస్తాడని పేర్కొన్నాడు. ఒకవేళ రూట్ కూడా సెంచరీ కూడా చేయకపోతే తాను మెల్ బోర్న్ గ్రౌండ్ లో నగ్నంగా నడుస్తానని బోల్డ్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ వైరల్ కాగా.. తాజాగా ఈ కామెంట్స్ పై స్పందించిన హెడెన్ కూతురు గ్రేస్ హెడెన్ స్పందించింది. ఫ్లీజ్ దయచేసి మా నాన్న చెప్పినట్టు ఆ పని చేయి.. లేకుంటే మా నాన్న అన్నంత పని చేస్తాడని ఎమోషనల్ అయింది. ప్రస్తుతం గ్రేస్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా కొనసాగుతున్న జో రూట్.. ఇప్పటివరకు ఆస్ట్రేలియా గడ్డ పై మాత్రం ఒక్క సెంచరీ కూడా చేయలేకపోవడం గమనార్హం.
Also Read : Chris Lynn : క్రిస్ లిన్ భయంకరమైన బ్యాటింగ్.. ఒకే ఓవర్లో 5 సిక్సులు
అందుకోసం రూట్ ని బ్రతిమిలాడిన గ్రేస్ హెడెన్..
ఆస్ట్రేలియా తో జరిగిన ఓ మ్యాచ్ లో మాత్రం రూట్ సెంచరీ చేస్తాడని భావించినప్పటికీ 91 పరుగులు మాత్రమే సాధించి నాటౌట్ గా నిలిచాడు. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 14 టెస్టులు ఆడిన రూట్..అందులో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఆస్ట్రేలియాలో కూడా సగటు మెరుగ్గానే ఉందట. 14 టెస్ట్ మ్యాచ్ ల్లో కలిపి 35.6 సగటుతో 892 పరుగులు చేశాడు. ఇందులో 9 హాఫ్ సెంచరీలున్నాయి. ఇంగ్లాండ్ తరపున 134 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన రూట్ 13,543 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు కూడా ఉండటం విశేషం. కానీ ఆస్ట్రేలియా గడ్డ పై మాత్రం ఒక్క సెంచరీ కూడా చేయకపోవడం గమనార్హం. ప్రస్తుతం మాథ్యూ హెడ్, అతని కూతురు గ్రేస్ హెడెన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం విశేషం. సెంచరీ కోసం రూట్ ని గ్రేస్ హెడెన్ బ్రతిమిలాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.