Fan With Indian Flag: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా మే 22 శనివారం రోజున లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 351 పరుగులు చేసింది. ఈ టోర్నీ హిస్టరీలోనే ఓ జట్టు చేసిన అత్యధిక స్కోర్. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్ {165} సెన్సేషనల్ సెంచరీ తో అదరగొట్టాడు.
ఈ భారీ లక్ష్యాన్ని కంగారులు 5 వికెట్లు కోల్పోయి 15 బంతులు మిగిలి ఉండగానే ఛేదించారు. ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జోష్ ఇంగ్లీస్ {120*}, అలెక్స్ కేరి {69}, మ్యాథ్యూ షార్ట్ 63 హౌఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో ఛాంపియన్ ట్రోఫీలో ఆస్ట్రేలియా శుభరంభం చేసింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లాహోర్ స్టేడియంలో ఇంగ్లాండ్ – ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ ఇండియన్ క్రీడాభిమాని {Fan With Indian Flag} భారత జాతీయ జెండాతో దర్శనమిచ్చాడు.
దీంతో వెంటనే అలెర్ట్ అయిన అధికారులు ఆ అభిమానిని అరెస్టు చేశారు. బ్లాక్ కోట్ ధరించిన ఆ అభిమాని.. స్టాండ్స్ లో భారత జాతీయ జెండా {Fan With Indian Flag} తో కనిపించాడు. దీంతో అక్కడి అధికారులు భారత జాతీయ జెండాని అతని వద్ద నుంచి లాక్కొని.. అతడిని స్టేడియం నుండి అరెస్టు చేసి తీసుకు వెళ్లారు. అతడిని అరెస్టు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు కూడా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
స్టేడియంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జాతీయ గీతాలను ప్లే చేస్తున్న సమయంలో.. స్టేడియంలో సౌండ్ సిస్టం నుంచి భారత జాతీయ గీతం జనగణమన ప్రతిధ్వనించడం ప్రారంభించింది. దీంతో వెంటనే భారత జాతీయ గీతాన్ని నిలిపివేసి.. కొన్ని సెకండ్ల తర్వాత ఆస్ట్రేలియా గీతాన్ని ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోఫీపై ISKP ఉగ్రవాద దాడి ముప్పు పొంచి ఉందని వర్గాలు హెచ్చరించాయి.
ఆటగాళ్ల కిడ్నా ప్రయత్నాలు కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం. ఈ సంఘటన పాకిస్తాన్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. దీంతో టోర్నమెంట్ భద్రతను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఉగ్రవాద దాడి పొంచి ఉందని విదేశీ సంస్థలు కూడా భారత ఏజెన్సీలకు సమాచారం అందించాయి. అయితే భద్రతా కారణాల దృశ్యా భారత్.. పాకిస్తాన్ కి వెళ్లడానికి నిరాకరించిన విషయం తెలిసిందే.
దీని గురించి పాకిస్తాన్ మీడియాలో చాలా గొడవ జరిగింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని గతంలో విమర్శించినప్పటికీ.. ప్రస్తుతం ఉగ్రదాడి పొంచి ఉందన్న సమాచారంతో భారత్ అక్కడికి వెళ్లకుండా తీసుకున్న నిర్ణయమే సరైనది అంటూ కామెంట్స్ చేస్తున్నారు భారత క్రీడాభిమానులు. ఇక ఈ టోర్నీలో ఇప్పటికే బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లపై విజయం సాధించిన భారత జట్టు సెమిస్ కి చేరుకుంది.
A man arrested and beaten in Lahore stadium for having Indian Flag 🇮🇳 pic.twitter.com/TBFg8nlHa3
— Riseup Pant (@riseup_pant17) February 24, 2025