మన శరీరానికి అత్యవసరమైన విటమిన్లలో విటమిన్ బి12 ఒకటి. మన శరీరానికి అన్ని రకాల ఖనిజాలు, విటమిన్లు సరైన మొత్తంలో అందితేనే మనం ఆరోగ్యంగా జీవించగలం. కొన్ని ముఖ్యమైన విటమిన్12 లోపం ఏర్పడితే అది శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అలాంటి ముఖ్యమైన విటమిన్లలో విటమిన్ బి12 ఒకటి.
విటమిన్ బి12 లోపం లక్షణాలు
దీని లోపం వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. అనేక వ్యాధులు కూడా రావచ్చు. విటమిన్ బి12 ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి, DNA సంశ్లేషణకు, ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థకు ఎంతో అత్యవసరం. బలహీనత, అలసట, శ్వాస ఆడక పోవడం, రక్తహీనత ఇవన్నీ కూడా విటమిన్ బీ12 వల్ల వచ్చే సమస్యలే.
ఎవరిలో అయితే విటమిన్ బి12 లోపిస్తుందో వాళ్ళు చేతులు, కాళ్లల్లో జలదరింపులు తరచూ వస్తాయి. తిమ్మిరి పట్టినట్టు అనిపిస్తుంది. వారు సరిగా నడవలేరు. జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది. మానసిక స్థితిలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. నాడీ సంబంధిత వ్యాధులు ఎక్కువైపోతాయి. దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి విటమిన్ బి12 లోపాన్ని తేలికగా తీసుకోకూడదు.
విటమిన్ బి12 లోపం తీరాలంటే సప్లిమెంట్లను వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఆహారాన్ని వండుకొని తినవచ్చు. మీరు పెసరపప్పును తినడం ద్వారా విటమిన్ బి12 సమృద్ధిగా లభిస్తుంది. పెసరపప్పును నీళ్ళల్లా వండుకొని ఆ నీరు తాగడం వల్ల విటమిన్ బి12 లోపం తగ్గుతుంది.
పెసరపప్పు నీరు
ఒక కప్పు పెసరపప్పును శుభ్రంగా కడిగి నీటిలో ముందుగా నానబెట్టండి. ఆ పప్పు దాదాపు కనీసం 10 గంటల పాటు నానేలా చూసుకోండి. ఆ తర్వాత ఆ నీటిని తాగడానికి ప్రయత్నించండి. మిగిలిన పప్పును వండుకొని తినవచ్చు లేదా పచ్చిపప్పు తిన్నా ఆరోగ్యానికి మంచిదే. ఇలా ప్రతిరోజూ పెసరపప్పు నానబెట్టిన నీటిని తాగడం వల్ల విటమిన్ బి12 లోపం త్వరగా పోతుంది. పెసరపప్పును ఉడకబెట్టిన నీటిని తాగినా కూడా ఆరోగ్యానికి మంచిదే.
మీ శరీరంలో కొన్ని రకాల మార్పులు విటమిన్ బి12 లోపాన్ని సూచిస్తాయి. ఆహారం తిన్న తర్వాత కూడా అలసటగా, బలహీనంగా అనిపించడం, తల తిరగడం వంటివి ఈ విటమిన్ లోపం వల్లే కలుగుతాయి. హృదయ స్పందన రేటు పెరిగిపోవడం, శ్వాస ఆడక పోవడం, చర్మం పాలిపోయినట్టు అవ్వడం కూడా విటమిన్ బి12 లోపం వల్ల జరుగుతుంది. నాలుక పై చిరాకుగా అనిపించడం, నొప్పిగా అనిపించడం వంటి లక్షణాలు కూడా కలుగుతాయి. విరేచనాలు కావడం లేదా మలబద్ధకం రావడం, గోళ్లు రంగు మారడం కూడా విటమిన్ బి12 లోపానికి కారణమే. ఆకలి వేయకపోవడం కూడా విటమిన్ బి12 లోపాన్ని సూచిస్తుంది.
Also Read: బీట్ రూట్ ఫేస్ జెల్‌తో.. కొరియన్ గ్లాసీ స్కిన్ గ్యారంటీ !
విటమిన్ బీ12 అధికంగా ఉండే ఆహారాలు ఎన్నో ఉన్నాయి. చేపలు, మాంసం, పాల ఉత్పత్తులు, గుడ్లు తీసుకోవడం ద్వారా ఈ విటమిన్ లోపాన్ని నివారించవచ్చు. మాంసాహారం తినని వాళ్ళు పెసరపప్పును తినడం ద్వారా విటమిన్ బి12 లోపాన్ని అధిగమించవచ్చు.