BigTV English

Sushmita Sen: పెళ్లిపై ఊహించని కామెంట్.. అలాంటివాడే కావాలంటూ..!

Sushmita Sen: పెళ్లిపై ఊహించని కామెంట్.. అలాంటివాడే కావాలంటూ..!

Sushmita Sen:మాజీ ప్రపంచ సుందరి సుస్మితాసేన్ (Sushmita Sen) బాలీవుడ్ నటిగా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు అందుకుంది.. 49 ఏళ్ల వయసులో కూడా తన అందంతో, అభినయంతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఒక అభిమాని పెళ్లి గురించి ప్రస్తావించగా.. దానిపై స్పందిస్తూ ఆసక్తికర కామెంట్లు పంచుకుంది. చిట్ చాట్ లో భాగంగా అభిమాని ప్రశ్నిస్తూ..” మీరు ఎప్పుడు వివాహం చేసుకుంటారు? అని ప్రశ్నించగా.. దానికి సుస్మితా సేన్ స్పందిస్తూ..” నాకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ సరైన వ్యక్తి దొరకాలి కదా.. మనం అనుకున్న వెంటనే పెళ్లి జరగదు. ఎందుకంటే ఇది రెండు హృదయాలకు సంబంధించిన విషయం. అతనితో ప్రేమ , సంబంధం నా హృదయానికి కూడా నచ్చాలి. అప్పుడే నేను కూడా పెళ్లి చేసుకుంటాను” అంటూ సుస్మితా సేన్ తెలిపింది. ఇది విన్న అభిమానులు, నెటిజన్స్ సుస్మిత మనసుకు నచ్చేవాడు ఎవరో అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Tamannaah Bhatia: పెళ్లికి సిద్ధమైన తమన్నా.. చివరి సినిమా అదేనా..?

సుస్మితా సేన్ ప్రేమ, బ్రేకప్..


ఇదిలా ఉండగా సుస్మితా సేన్ గతంలో నటుడు రోహ్మన్ షాల్ తో ప్రేమాయణం కొనసాగించిన విషయం తెలిసిందే. దాదాపు మూడు సంవత్సరాల డేటింగ్ తర్వాత 2021లో అతనితో బంధానికి గుడ్ బాయ్ చెప్పేసిన ఈమె.. అంతకుముందు ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ తో కూడా రిలేషన్ లో ఉన్నట్లు ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అంతేకాదు అతనితో కాస్త చనువుగా ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ “బెటర్ ఆఫ్” అంటూ కూడా పరిచయం చేసింది. ఆ తర్వాత ఇదే విషయంపై ప్రశ్నించగా దీనిని కొట్టివేసింది సుస్మిత. ఇక ఇప్పుడు మళ్లీ మనసుకు నచ్చేవాడు కావాలని చెబుతూనే ఒక తోడు కోసం ఎదురుచూస్తోంది . మరి సుస్మితా సేన్ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.

పెళ్లి కాకుండానే తల్లి అయిన సుస్మిత..

ఇకపోతే పెళ్లి కాకుండానే తల్లి అయ్యి గొప్ప మనసు చాటుకుంది సుస్మితా సేన్. 2000వ సంవత్సరంలో రెనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుంది .ఇక 2010లో అలీషా అనే మరో అమ్మాయిని కూడా దత్తత తీసుకొని, ఇప్పుడు ఆ పిల్లల ఆలనా.. పాలనా చూసుకుంటూ కెరీర్ ను సాగిస్తోంది. మొత్తానికి అయితే వైవాహిక బంధంలో స్థిరపడకుండానే ఇద్దరు అనాధ పిల్లలను దత్తత తీసుకొని, గొప్ప మనసు చాటుకోవడంతో అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

సుస్మితా సేన్ కెరియర్..

1994లో విశ్వసుందరి పోటీలలో విజేతగా నిలిచిన ఈమె, ఆ తర్వాత హిందీ, తెలుగు, తమిళ్ సినిమాలలో నటించి ఆకట్టుకుంది. 1975 నవంబర్ 19న హైదరాబాద్లో జన్మించిన సుస్మితా మాతృభాష బెంగాలీ.. తండ్రి షుభీర్ సేన్ వింగ్ కమాండర్ గా పనిచేశారు. హైదరాబాదులో జన్మించినప్పటికీ ఈమె విద్యాభ్యాసం మొత్తం ఢిల్లీలోనే సాగింది. సుస్మితా సేన్ ఎక్కువగా సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 2013లో మదర్ థెరీసా అంతర్జాతీయ అవార్డు కూడా అందుకుంది. ఇక ‘రక్షకుడు’అనే సినిమాలో నటించిన ఈయన ఎక్కువగా బాలీవుడ్ లో సినిమాలు చేసి భారీ పాపులారిటీ అందుకుంది. మొత్తానికి అయితే సుష్మితా సేన్ వైవాహిక బంధానికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×