E-Paper
Advertisement

England vs Pakistan: వ‌ర్షం ఎఫెక్ట్‌…న‌క్క తోక తొక్కిన పాకిస్తాన్‌, ఒక్క మ్యాచ్ ఆడ‌కున్నా సెమీ ఫైన‌ల్ లోకి ఎంట్రీ..?

England vs Pakistan: వ‌ర్షం ఎఫెక్ట్‌…న‌క్క తోక తొక్కిన పాకిస్తాన్‌, ఒక్క మ్యాచ్ ఆడ‌కున్నా సెమీ ఫైన‌ల్ లోకి ఎంట్రీ..?
Advertisement

England vs Pakistan:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో  ( T20 World Cup 2026 tournament )  భాగంగా ప్రస్తుతం సూపర్ 8 మ్యాచ్ లు కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ టోర్నమెంటులో పాకిస్తాన్ నక్క తోక తొక్కినట్లే కనిపిస్తోంది. అదృష్టవశాత్తు సూపర్ 8 దశ వరకు వచ్చిన పాకిస్తాన్, ఒక్క మ్యాచ్ ఆడకుండానే సెమీఫైనల్ వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీని అంతటికి కారణం వరుణుడు అని చెబుతున్నారు. సూపర్ 8 దశలో ఇప్పటికే వర్షం కారణంగా పాకిస్తాన్ ప్లేయర్లు గ్రౌండ్ లో దిగక ముందే ఖాతా లోకి ఒక పాయింట్ వచ్చింది. పాకిస్తాన్ ఆడే ఇవాల్టి మ్యాచ్ తో పాటు శ్రీలంక మ్యాచ్ సందర్భంగా కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో గ్రౌండ్లో దిగక ముందే పాకిస్తాన్ సెమీఫైనల్ చేరుతుందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో అదృష్టం అంటే పాకిస్తాన్ దే.. అంటూ అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు.

Also Read: Ind T20i wc 2026-WC 2011: గంభీర్ అంధ భ‌క్తుల వెర్రి ప్ర‌చారం..2011 వ‌ర‌ల్డ్ క‌ప్ హిస్ట‌రీ, 2026లో రిపీట్ అవుతుందంటూ ఓవరాక్ష‌న్‌

ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్… వర్షం విలన్ గా మారనుందా ?

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సూపర్ 8 లో భాగంగా ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ఉంటుంది. ఆరున్నర గంటలకు టాస్ వేస్తారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం ఇవాళ కూడా మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే ఛాన్సులు ఉన్నట్లు చెబుతున్నారు. 30% సాయంత్రం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ అదృష్టం బాగుంటే, మ్యాచ్ వర్షం కారణంగా రద్దయే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు. అదే జరిగితే పాకిస్తాన్ అలాగే ఇంగ్లాండ్ జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టుతో పోరాడడం కంటే ఒక్క పాయింట్ తీసుకొని ఈ పాకిస్తాన్ సైలెంట్ గా ఉండటమే మంచిదని అంటున్నారు. ఇదే జరిగితే పాకిస్తాన్ సెమీఫైనల్ బరిలోనే ఉంటూ పాయింట్ల పట్టికలో కూడా రెండవ స్థానంలో నిలుస్తుంది.

మ్యాచ్ ఆడకుండానే సెమీఫైనల్ లోకి పాకిస్తాన్ ఎంట్రీ ?

సూపర్ 8 లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఇప్పటికే వర్షం కారణంగా రద్దయింది. ఇక ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కూడా రద్దయ్య చాన్స్ లు ఉన్నాయట. ఇదే జరిగితే పాకిస్తాన్ ఖాతాలోకి రెండు పాయింట్లు వస్తాయి. ఆ తర్వాత శ్రీలంకతో పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుంది. అప్పుడు కచ్చితంగా మ్యాచ్ జరిగితే పాకిస్తాన్ విక్టరీ కొట్టే అవకాశాలే ఎక్కువ. అదే జరిగితే పాకిస్తాన్ ఖాతాలోకి నాలుగు పాయింట్లు వస్తాయి. రన్ రేట్ కూడా అప్పుడు పెరుగుతుంది. లేదా పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా కూడా, పాకిస్తాన్ కు అడ్వాంటేజ్ జరుగుతుంది. ఇక అదే సమయంలో న్యూజిలాండ్ తన తర్వాతి మ్యాచ్ ల‌లో భాగంగా శ్రీలంక, ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవాలి. అప్పుడు న్యూజిలాండ్ తో పాటు శ్రీలంక కూడా ఎలిమినేట్ అవుతుంది. ఇక మిగిలిన ఇంగ్లాండ్ అలాగే పాకిస్తాన్ సెమీ ఫైనల్ చేరుతాయి. ఇలా ఒక్క మ్యాచ్ ఆడకుండానే సెమీ ఫైనల్ కు పాకిస్తాన్ వెళ్తుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Advertisement

Also Read:  Hardik Pandya-Mahieka Sharma: హార్దిక్ పాండ్యా ఇంట్లోనే శ‌త్రువులు, ఔట్ కాగానే చప్పట్లు కొట్టిన మహికా శర్మ

 

Related News

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

Big Stories

Advertisement
×