BigTV English

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ తొలి పతకం సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భాకర్ కాంస్య పతకాన్ని గెలిచింది. 221.7 పాయింట్ల తేడాతో బాకర్ మూడో స్థానంలో నిలిచింది. దీంతో ఒలింపిక్స్ లో షూటింగ్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా మను బాకర్ రికార్డు సృష్టించింది. ఇద్దరు కొరియన్ అథ్లెట్స్ స్వర్ణం, రజతం పతకాలు సాధించారు.


మరోవైపు.. పురుషుల 10మీ ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో అర్జున్ బబుతా అదరగొట్టేశాడు. 630.1 స్కోర్‌తో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు క్వాలిఫై అయ్యాడు. ఇదే విభాగంలో మరో భారత షూటర్ సందీప్ సింగ్ 629.3 స్కోర్ సాధించి 12వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. అయితే, పురుషుల 10మీ ఎయిర్ పిస్టల్ ఫైనల్ సోమవారం మ.3.30 గంటలకు ప్రారంభంకానున్నది.

Also Read: ఒలింపిక్స్ దుస్తులు నాసిరకంగా ఉన్నాయి: గుత్తా జ్వాలా


ఇది ఇలా ఉంటే.. మను బాకర్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. మనుబాకర్ విజయం ఇతర క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని ప్రశంసించారు. బాకర్ భవిష్యత్తులో మరిన్ని విజయాలను అందుకోవాలంటూ ఆకాంక్షించారు.

Related News

PAK Vs BAN : పాకిస్తాన్ కి షాక్.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs BAN : ఇండియానా… అదెక్కడుంది? బంగ్లాదేశ్ అభిమాని ఓవరాక్షన్

PAK Vs BAN : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Smriti Mandana : స్మృతి మంధానకు ఘోర అవమానం… ఆ ఫోటోలు వైరల్ చేసి!

Abhimanyu Easwaran : 25 సెంచరీలు, 30 అర్థ శతకాలు చేసినా ఛాన్స్ దక్కడం లేదు…అభిమన్యు ఏం పాపం చేశాడు రా !

Inzamam-ul-Haq : అభిషేక్ శర్మ బ్యాట్ లో చిప్స్.. అందుకే దారుణంగా ఆడుతున్నాడు

Asia Cup 2025 : అభిషేక్ శర్మ రనౌట్… దుబాయ్ స్టేడియంలో ఏడ్చేసిన లేడీ

Team India : వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక..వైస్ కెప్టెన్ గా జ‌డేజా..షెడ్యూల్ ఇదే

Big Stories

×