BigTV English
Advertisement

Former MLA Passed Away: ఏపీ మాజీ ఎమ్మెల్యే, ఎంపీ మృతి

Former MLA Passed Away: ఏపీ మాజీ ఎమ్మెల్యే, ఎంపీ మృతి

Former MLA Rammohan Rao passed away(Andhra news today): విజయనగరం జిల్లాలోని బొబ్బిలి నియోజకవర్గం ఎంపీ, చీపురపల్లి మాజీ ఎమ్మెల్యే కేంబూరి రామ్మోహనరావు(75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను విశాఖలోని ఓ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ మేరకు రామ్మోహనరావుకు ఐసీయూలో ప్రముఖ వైద్యుల సమక్షంలో చికిత్స అందించారు. అయితే ఆరోగ్యం విషమించడంతో బుధవారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందారు.


టీడీపీ నుంచి 1985లో చీపురపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కేంబూరి రామ్మోహనరావు.. 1989 వరకు కొనసాగారు. ఆ తర్వాత 1989లో టీడీపీ సభ్యుడిగా బొబ్బిలి నుంచి 9వ లోక్ సభలో ఘన విజయం సాధించారు.. పేదల అభివృద్ధి కోసం నిరంతరం తపనపడేవారు. అయితే గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

Also Read: జగన్‌కు సంకేతాలు.. బొత్స ఓటమి ఖాయం! జీవీఎంసీ ఎన్నికల్లో..


1949 అక్టోబర్ 12న శ్రీకాకుళం జిల్లా పుర్లిలో జన్మించారు. ఈయన విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో విద్యాభ్యాసం అభ్యసించారు. 1974లో రుషిని వివాహం చేసుకున్నారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు. అనంతరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి చురుకుగా పనిచేసేవారు. అయితే, కెంబూరి మరణవార్త తెలుసుకున్న రాజకీయ ప్రముఖులతోపాటు టీడీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

Related News

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Big Stories

×