BigTV English

Pat Cummins : కమిన్స్ సక్సెస్ స్టోరీ.. ఫింగర్ విరిగిన కూడా.. సక్సెస్ అందుకున్నాడు

Pat Cummins : కమిన్స్ సక్సెస్ స్టోరీ.. ఫింగర్ విరిగిన కూడా.. సక్సెస్ అందుకున్నాడు

 Pat Cummins :  పాట్ కెమిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇతను ఆస్ట్రేలియా కెప్టెన్. అలాగే ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కి కూడా కెప్టెన్. ఇతనీ కెప్టెన్సీలో గత సీజన్ లో SRH జట్టు ఫైనల్ కి చేరుకుంది. కానీ ఈ సీజన్ లో మాత్రం పేలవ ప్రదర్శన కనబరిచింది. ప్రారంభం.. చివరి మ్యాచ్ ల్లో మాత్రం అధ్బుతమైన ఇన్నింగ్స్ ఆఢింది. పాట్ కమిన్స్ ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ ఆడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అతనికి ఓ ఫింగర్ విరిగినప్పటికీ అద్భుతమైన బౌలింగ్ చేసి మంచి సక్సెస్ సాధించాడు. అలా మరెవ్వరికీ సాధ్యం కాదనే చెప్పాలి. వాస్తవానికి మిడిల్ ఫింగర్ గ్రిప్ లేకుండా ఫాస్ట్ బౌలింగ్ చేయడం చాలా కష్టం అనే చెప్పాలి. వాటన్నింటినీ దాటుకుంటూ ఈరోజు వరల్డ్ లోనే బెస్ట్ ఫాస్ట్ బౌలర్ గా మారాడు. 2023లో పాట్ కమిన్స్ తల్లి క్యాన్సర్ కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. చనిపోయే ముందు వాళ్ల అమ్మ విజయాన్ని ఎదుర్కోమని ఓ మాట చెప్పింది. అదే సంవత్సరం ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ గెలిచింది. ఐసీసీ వరల్డ్ ఛాంపియన్ గా విన్ అయ్యాడు. తాజాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు.


ఆరు వికెట్లు తీసి రికార్డు.. 

ముఖ్యంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆరు వికెట్లు తీసిన తొలి బౌలర్ గా కమిన్స్ రికార్డు నెలకొల్పాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 28 పరుగులే ఇచ్చి.. 6 వికెట్లను తీశాడు. కీలక బ్యాట్స్ మెన్స్ తెంబా బావుమా, బెండింగ్ హామ్, వియాన్ ముల్డర్, కైల్ వెరినే, మార్కో యాన్సెన్, రబాడలను ఔట్ చేశాడు కమిన్స్. కెప్టెన్ కమిన్స్ అద్భుతమైన బౌలింగ్ చేయడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 138 పరుగులకే కుప్ప కూలింది. ఈ అద్భుతమైన ప్రదర్శనతో టెస్ట్ ల్లో 300 వికెట్లు పూర్తిచేసుకున్నాడు కమిన్స్. అలాగే ఐసీసీ ఫైనల్స్ లో 6 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా రికార్డుల్లోకెక్కాడు. అంతేకాదు.. ఐసీసీ ఫైనల్స్ లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్ గా ఘనత సాధించాడు.


ఆ రికార్డు బ్రేక్.. 

ఇక అంతకు ముందు ఈ ఫీట్ సౌతాఫ్రికా దిగ్గజ ఆల్ రౌండర్ జాక్వెస్ కలిస్ పేరిట ఉండేది. 1998 ఛాంపియన్స్ ట్రోఫీలో కలిస్ 7.3 ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఇప్పుడు ఆ రికార్డును కమిన్స్ బ్రేక్ చేయడం విశేషం. జస్ ప్రీత్ బుమ్రా ని అధిగమించి డబ్య్లూటీసీ 2023-25లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా కమిన్స్ రికార్డు నెలకొల్పాడు. మరోవైపు బిషన్ సింగ్ బేడీని అధిగమించి టెస్ట్ ల్లో అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన ఘనత సాధించిన మూడో కెప్టెన్స్ గా నిలిచాడు. రిచీ బెనాడ్ 9 సార్లు.. ఇమ్రాన్ ఖాన్ 12సార్లు పాకిస్తాన్ అతని కంటే ముందు ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 212, సెకండ్ ఇన్నింగ్స్ లో 207 పరుగులకు ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 138 పరుగులకే ఆలౌట్ అయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో 48 ఓవర్లకు 188 పరుగులు చేయగలిగింది. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయింది. మరో 94 పరుగులు చేస్తే.. సౌతాఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ని గెలుచుకోనుంది.

?igsh=MXdvd2Npczk0MXduOA==

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×