BigTV English

Dangerous Cricket Team : అత్యంత భయంకరమైన జట్టుగా ఆస్ట్రేలియా.. వీళ్ళ పేర్లు తలుచుకుంటేనే వణుకు పుట్టాల్సిందే

Dangerous Cricket Team : అత్యంత భయంకరమైన జట్టుగా ఆస్ట్రేలియా.. వీళ్ళ పేర్లు తలుచుకుంటేనే  వణుకు పుట్టాల్సిందే

Dangerous Cricket Team : సాధారణంగా ప్రపంచంలో డేంజరస్ క్రికెట్ టీమ్ ఏది అనగానే అందరికీ టక్కున గుర్తుకొచ్చేది ఆస్ట్రేలియా టీమే. ఎందుకంటే ఆ జట్టు ఎప్పుడూ కూడా అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతుంటుంది. ఇక ఫైనల్ కి వచ్చిందంటే.. కప్ సాధించే వరకు ఊరుకోదు. అది ఏ మ్యాచ్ లోనైనా సరే.. ఆస్ట్రేలియా జట్టుని మాత్రం ఫైనల్ కి చేరనీవ్వకూడదు. ఫైనల్ కి చేరిందంటే.. అపోజిట్ టీమ్ చేతులెత్తేయాల్సిందే. ఇది ఇప్పటి వరకు జరిగిన క్రికెట్ మ్యాచ్ లను బట్టి స్పష్టంగా అర్థం అవుతోంది. ముఖ్యంగా 2003లో ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ అత్యంత డేంజరస్ క్రికెట్ అని చెప్పవచ్చు. 2003 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ఫైనల్ కి వెళ్లింది. ఆస్ట్రేలియా తో ఢీ కొట్టేందుకు సౌరబ్ గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా కూడా ఫైనల్ కి చేరుకుంది.


Also Read :  Pat Cummins : కమిన్స్ సక్సెస్ స్టోరీ.. ఫింగర్ విరిగిన కూడా.. సక్సెస్ అందుకున్నాడు

 ఇదే.. డేంజరస్ ఆస్ట్రేలియా జట్టు.. 


ఫైనల్ లో బలమైన టీమ్ అయిన ఆస్ట్రేలియా ని ఢీ కొట్టలేదని కొందరూ క్రీడాభిమానులు పేర్కొంటే.. మరికొందరూ ఫైనల్ కి వచ్చిందంటే.. లక్ కలిసి వస్తుందని.. కచ్చితంగా ఇండియా గెలుస్తుందని కాస్త ధైర్యం చెప్పారు. దీనికి తోడు అప్పట్లో మీడియా విపరీతంగా టీమిండియాదే కప్ అన్నట్టు ప్రచారం చేసింది. కానీ ఆస్ట్రేలియా ను ఢీ కొట్టలేకపోయింది. 1999, 2003, 2007 సీజన్ లో వరుసగా వరల్డ్ కప్ సాధించిన టీమ్ గా ఆస్ట్రేలియా జట్టు నిలిచింది. ఇక అందులో రెండు వరల్డ్ కప్ లలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదంటేనే అర్థం చేసుకోవచ్చు. అది ఎంత పవర్ పుల్ టీమ్ అనేది. టీమ్ అంతా మ్యాచ్ విన్నర్లే.. వీరిలో ముఖ్యంగా హెడెన్, గిల్ క్రిస్ట్, రికీ పాంటింగ్, మార్టిన్, లెహ్మన్, బియాన్, సైమండ్స్, బ్రెట్ లీ, షేన్ వార్న్, మెగ్రాత్, గిలెప్సీ వంటి కీలక ఆటగాళ్లు ఉండేవారు.

రికీ పాంటింగ్ రికార్డులు.. 

అప్పట్లో ఆస్ట్రేలియా జట్టుతో ఒక్క మ్యాచ్ గెలిచినా.. వరల్డ్ కప్ గెలిచినంత సంతోషంలో ఉండేవారు. గిల్ క్రిస్ట్, హెడెన్ అద్భుతమైన ఓపెనింగ్స్ జంట. 50 ఓవర్ల మ్యాచ్ ని టీ-20 మ్యాచ్ ల మాదిరిగా ఆడారు. కెప్టెన్ రికీ పాంటింగ్ మోస్ట్ పవర్ పుల్ కెప్టెన్. వరుసగా రెండు వరల్డ్ కప్స్, రెండు ఛాంపియన్స్ ట్రోఫీలను గెలిచి అత్యధిక ఐసీసీ ట్రోఫీలను అందుకున్న కెప్టెన్ గా రికీ పాంటింగ్ రికార్డులకెక్కాడు. మార్టిన్ క్లాసిక్ బ్యాట్స్ మెన్. వీళ్లందరూ ఔట్ అయినా అపోజిషన్ కి చుక్కలు చూపేందుకు మాన్ స్టర్ ఉండేవాడు అతనే సైమండ్స్. బౌలింగ్ లో బ్రెట్ లీ, షేన్ వార్న్, మెక్ గ్రాత్, గిలెప్సీ వంటి కీలక బౌలర్లు ఆ జట్టు తరపున రాణించి వికెట్లు తీసేవారు. 1990లో పుట్టిన ఎవ్వరినీ అడిగినా క్రికెట్ లో గ్రెటెస్ట్ టీమ్ ఏదైనా ఉందంటే.. అది ఆస్ట్రేలియా అని తప్పక చెబుతుంటారు. ఎందుకంటే.. వాళ్ల ఆటతీరు అలా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న జట్టుతో పోల్చితే.. 2003 జట్టు మోస్ట్ డేంజరస్ జట్టు అని చెప్పవచ్చు. అప్పట్లో ఉన్న ఆటగాళ్లు ఇప్పుడు మరే టీమ్ లో లేరనే చెప్పవచ్చు. అందుకే ఆస్ట్రేలియా జట్టు అన్ని వరల్డ్ కప్ లు సాధించింది. వారిని ఆదర్శంగా తీసుకుంటే.. మరే జట్టు అయినా సునాయసంగా విజయం సాధిస్తుంది.

?igsh=NDlycWl2M2VhaWM4

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×