OTT Movie : బోస్టన్‌లోని ఒక పాత టౌన్‌హౌస్‌లోకి అడుగుపెట్టిన ఫ్లెచ్ కి ఊహించని షాక్ తగులుతుంది. నిజానికి అతను ఒక విలువైన ఆర్ట్ కలెక్షన్‌ను కనిపెట్టే మిషన్‌లో ఉంటాడు. కానీ తలుపు తెరిచిన వెంటనే, అతని పాదాల వద్ద ఒక మృతదేహం కనిపిస్తుంది. ఫ్లెచ్‌కు ఇప్పుడు ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా మారతాడు.ఫ్లెచ్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి, దొంగిలించబడిన కళాఖండాలను కనిపెట్టడానికి ఒక ప్రమాదకరమైన ఆట ఆడతాడు. అతడు ఎటువంటి ఆట ఆడతాడు ? ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీ ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
ఫ్లెచ్‌ను ఒక ఇటాలియన్ బిలియనీర్ కౌంట్ తన కుటుంబానికి చెందిన విలువైన ఆర్ట్ కలెక్షన్‌ను కనిపెట్టమని ఫ్లెచ్‌ను నియమిస్తాడు. ఇందులో ఒక అమూల్యమైన పికాసో పెయింటింగ్ కూడా ఉంటుంది. ఈ మిషన్ ఫ్లెచ్‌ను రోమ్ నుండి బోస్టన్‌కు తీసుకొస్తుంది. అక్కడ అతను తన స్నేహితురాలు ఏంజెలాతో కలిసి ఈ మిషన్ ను ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. అయితే బోస్టన్‌లోని టౌన్‌హౌస్‌లోకి అడుగుపెట్టగానే, అతను ఒక మృతదేహాన్ని చూసి షాక్‌కు గురవుతాడు. ఇన్‌స్పెక్టర్ మన్రో, జూనియర్ డిటెక్టివ్ గ్రిజ్ ఈ కేసులో ఫ్లెచ్‌ను ప్రధాన నిందితుడిగా భావిస్తారు. ఎందుకంటే అతని వేలిముద్రలు హత్య చేసిన ఆయుధంపై కనిపిస్తాయి.
ఫ్లెచ్ ఇప్పుడు రెండు లక్ష్యాలను సాధించాలి. మొదటిది .. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం. రెండవది .. దొంగిలించబడిన ఆర్ట్ కలెక్షన్‌ను కనిపెట్టడం. ఈ క్రమంలో అతను బోస్టన్‌లోని విచిత్రమైన మనుషులను కలుస్తాడు. ఫ్లెచ్ తన విచారణలో తన పాత బాస్ ఫ్రాంక్ జాఫీ సహాయం కూడా తీసుకుంటాడు. ఆ తరువాత అతనికి ఊహించని సంఘటనలు ఎదురుపడతాయి. చివరికి ఫ్లెచ్ ఆర్ట్ కలెక్షన్ ను కనిపెడతాడా ? హత్య కేసులో ఎలా బయట పడతాడు ? ఇందులో ఇంకెంతమంది పాత్ర ఉంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : చర్చి ఫాదర్స్ ని వేటాడే తీవ్రవాదులు… దెయ్యం ఎంట్రీతో హడలిపోయే సిస్టర్స్… సీను సీనుకీ బిత్తరపోయే ట్విస్టులు
ఈ సినిమా ఏ ఓటీటీలో ఉందంటే
ఈ క్రైమ్ కామెడీ మూవీ పేరు ‘కన్ఫెస్, ఫ్లెచ్’ (Confess fletch). 2022 లో వచ్చిన ఈ సినిమాకి గ్రెగ్ మోటోలా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. 1976 లో గ్రెగరీ మెక్‌డొనాల్డ్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇందులో జాన్ హామ్ ఇర్విన్ ‘ఫ్లెచ్’ పాత్రలో నటించాడు. ఫ్లెచ్ ఒక మాజీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా తన నటనకు ప్రశంసలు అందుకున్నాడు. imdb లో ఈ సినిమాకి 6.4/10 రేటింగ్ ఉంది. జియో హాట్ స్టార్ (Jio hotstar) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.