E-Paper
Advertisement

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల చిల్లర పంచాయితీ…ఆసియా లెజెండ్స్ లీగ్ అర్ధాంత‌రంగా రద్దు !

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల చిల్లర పంచాయితీ…ఆసియా లెజెండ్స్ లీగ్ అర్ధాంత‌రంగా రద్దు !
Advertisement

Asian Legends League 2026 Cancelled: ఆసియా లెజెండ్స్ లీగ్ 2026 టోర్నమెంట్ (Asian Legends League 2026 Tournament) ఆరంభ దశలోనే రద్దయింది. ఈ మెగా టోర్నమెంట్ ను జూలై 30వ తేదీన ప్రారంభించారు. మాజీ క్రికెటర్లు అందరూ ఎన్నో ఏళ్లుగా ఆడుతున్న ఆసియా లెజెండ్స్ లీగ్ టోర్నమెంటు 2026 జరగకుండా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ముందు నుంచి కుట్రలకు తెర లేపారు. అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) కూడా, రహస్యంగా పావులు కలిపింది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( ICC) అనుమతులు లేవన్న ఒక్క కారణంతో ఆసియా లెజెండ్స్ లీగ్ 2026 టోర్నమెంటు ఎనిమిది మ్యాచ్ లు జరిగిన తర్వాత రద్దు అయింది. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ టోర్నమెంట్ రద్దు అయిన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై కూడా విమర్శలు వస్తున్నాయి.

చిల్లర పంచాయితీ…ఆసియా లెజెండ్స్ లీగ్ అర్ధాంత‌రంగా రద్దు !

ఆసియా లెజెండ్స్ లీగ్ 2026 టోర్నమెంట్ జాంబియా రాజధాని లూసాకా వేదికగా జూలై 30వ తేదీన ప్రారంభమైంది. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లు చాలా విజయవంతంగా కొనసాగాయి. ఇంతలోనే ఈ టోర్నమెంట్ రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటన చేశారు. ఈ టోర్నమెంట్ కు ఐసీసీ, జాంబియా క్రికెట్ యూనియన్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదట టోర్నమెంట్ నిర్వాహకులు. దీంతో ఇది అనధికారిక టోర్నమెంట్ అని ఐసిసి గుర్తించి… రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే అర్ధాంతరంగా ఆసియా లెజెండ్స్ 2026 టోర్నమెంట్ రద్దు అయింది. అయితే ఈ టోర్నమెంట్ రద్దు అయిన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెటర్లు, PCB బోర్డుపై విమర్శలు వస్తున్నాయి. వీళ్లే కావాలని కుట్రకు తెరలేపి టోర్నమెంట్ రద్దు చేశారని ఆరోపణలు చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

Advertisement

Tanveer Ahmed On Babar Azam: టెస్టులను టీ20ల్లా బాబ‌ర్ ఆజం ఆడుతున్నాడు..ప్ర‌పంచ క్రికెట్ ను శాసిస్తాడు!

ఆసియా లెజెండ్స్ లీగ్ రద్దు వెనుక పాకిస్తాన్ హ‌స్తం

ఆసియా లెజెండ్స్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కాకముందే పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన మాజీ క్రికెటర్లు కుట్రకు తెర లేపారు. తమకు ఈ టోర్నమెంట్ ఆడితే రావాల్సిన డబ్బులను ముందుగానే సెటిల్ చేయాలని డిమాండ్ పెట్టారు. అయితే పాకిస్తాన్ పాంథర్స్ ఫ్రాంచైజీ, ఆసియా లెజెండ్స్ లీగ్ 2026 టోర్నమెంట్ యాజమాన్యం… ఆ డిమాండ్లకు ఒప్పుకోలేదు. కేవలం 40 శాతం ఫీజు చెల్లిస్తామని.. టోర్నమెంట్ ముగిసిన తర్వాత 100% డబ్బులు ఇస్తామని వెల్లడించాయి. కానీ ఈ టోర్నమెంట్ ఆడాల్సిన మాజీ క్రికెటర్లు మహమ్మద్ హఫీజ్, షోహెల్ తన్వీర్, ఉమర్ అక్మల్ లాంటి సీనియర్ క్రికెటర్లు తమకు ముందుగానే 100% ఫీజు చెల్లించాల్సిందేనని మెలిక పెట్టారు.

Advertisement

అయితే ఈ డిమాండ్లకు యాజమాన్యం ఒప్పుకోలేదు. దీంతో మహమ్మద్ హఫీజ్, షోహెల్ తన్వీర్, ఉమర్ అక్మల్ లాంటి సీనియర్ క్రికెటర్లు ఈ టోర్నమెంట్ ను బ‌హిష్క‌రించారు. ఈ క్రమంలో మిగిలిన ప్లేయర్లతో పాకిస్తాన్ పాంథర్స్ బరిలోకి దిగింది. ఆదివారం ఇండియాతో కూడా ఈ పాకిస్తాన్ పాంథర్స్ జట్టు తలపడి ఓడిపోయింది. అయితే తాము లేకుండా టోర్నమెంట్ సజావుగా సాగుతుందని కుట్రకు తెరలేపిన, టోర్నమెంట్ బహిష్కరించిన మహమ్మద్ హఫీజ్, షోహెల్ తన్వీర్, ఉమర్ అక్మల్ లాంటి సీనియర్ క్రికెటర్లు… పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో కుమ్మకు అయ్యారు. అందరూ కలిసి ఐసీసీకి ఫిర్యాదు చేశారు. ఆసియా లెజెండ్స్ లీగ్ 2026 టోర్నమెంట్ కు ఎలాంటి అనుమతులు లేవని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఐసీసీ.. టోర్నమెంట్ రద్దు చేసింది.

Rana Naved On Virender Sehwag: వీరేంద్ర సెహ్వాగ్ ను రెండు బంతుల్లోనే ఔట్ చేస్తా..పాక్ బౌల‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Related News

పాకిస్తాన్ జ‌ట్టులోనే బాబ‌ర్ కు విల‌న్లు..సెంచ‌రీ చేయ‌కుండా కావాల‌నే ఆపారు

ఓరి నీ దుంపతెగ..ఇదెక్క‌డి ర‌నౌట్ రా నాయ‌నా, దెబ్బ‌కు సూప‌ర్ ఓవ‌ర్ దాకా వెళ్లిన మ్యాచ్‌

పాకిస్తాన్ ప్లేయర్లు తాగిన డ్రింక్స్ లో మత్తు పదార్థాలు ?

RBI బ్యాంక్ లో ఉద్యోగం చేస్తోన్న‌ ఇషాన్ కిషన్..ఫోటోలు వైర‌ల్

వీరేంద్ర సెహ్వాగ్ ను రెండు బంతుల్లోనే ఔట్ చేస్తా..పాక్ బౌల‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

టెస్టులను టీ20ల్లా బాబ‌ర్ ఆజం ఆడుతున్నాడు..ప్ర‌పంచ క్రికెట్ ను శాసిస్తాడు!

స్టీవ్ వా ప‌రువు తీసిన బంగ్లా క్రికెట‌ర్ అష్రాఫుల్…అత‌ని ఆత్మ‌క‌థ‌లో అన్ని ప‌చ్చి అబద్దాలే

Big Stories

Advertisement
×