BigTV English

PM Modi: మీరే నిజమైన స్ఫూర్తి ప్రదాతలు.. పారా ఒలింపిక్ విజేతలతో ప్రధాని

PM Modi: మీరే నిజమైన స్ఫూర్తి ప్రదాతలు.. పారా ఒలింపిక్ విజేతలతో ప్రధాని

నిజానికి నేడు భారత క్రికెట్ ఈ స్థాయిలో ఉందంటే, అందుకు కారణం  జాతీయ కాంగ్రెస్ పార్టీ అని చాలామందికి తెలీదు. 1983 ప్రపంచకప్ జరుగుతున్న సమయంలో భారత జట్టు ఒకొక్క మ్యాచ్ గెలుస్తూ వెళుతుంటే, భారత ప్రజల్లో కనిపించిన ఉత్సాహాన్ని మొదట నాటి ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ చూశారు. ప్రజల్లో ఉన్న ఆసక్తిని గమనించి, ఇండియాలో క్రికెట్ కి మంచి భవిష్యత్ ఉందని మొదట ఊహించిన వారు నాటి ప్రధాని ఇందిర.

వెంటనే నాటి క్రికెట్ బోర్డుని పిలిచి..  భారత ప్రభుత్వం నుంచి మన క్రికెటర్లకి కావల్సిన సౌకర్యాలను పెంచమని సూచించారు. అలా ప్రభుత్వ సహకారం కూడా అందడంతో నాడు కపిల్ సేన రెట్టించిన ఉత్సాహంతో 1983లో ప్రపంచ కప్ సాధించింది. అలా  నాడు కాంగ్రెస్ పార్టీ వేసిన పునాదులపైనే నేడు బీసీసీఐ మహావ్రక్షంలా ఎదిగింది. ఇది చరిత్ర చెబుతున్న సత్యం.


ఈ నేపథ్యంలో దేశ ప్రధాని మోదీ నేడు విజేతలతో మాట్లాడుతూ వారిలో ఉత్సాహాన్ని, చైతన్యాన్ని నింపుతున్నారు. తాజాగా పారా ఒలింపిక్స్ లో విజేతలైన అథ్లెట్లతో టెలిఫోన్ లో మాట్లాడారు. మనీశ్ నర్వాల్, మోనా అగర్వాల్, ప్రీతి పాల్, రుబీనా ఫ్రాన్సిన్ తో ప్రధాని మాట్లాడి, వారిని పేరుపేరున ప్రశంసించారు. అభినందించారు. మీరందరూ దేశానికి నిజమైన స్ఫూర్తి ప్రదాతలని కొనియాడారు.

అంతేకాదు దేశానికి మీరు గర్వకారణమని తెలిపారు. అయితే స్వర్ణం సాధించిన అవనీ లేఖరా అందుబాటులో లేదు. ఎందుకంటే తనకి మరో మ్యాచ్ ఉండటంతో అక్కడికి వెళ్లింది. దీంతో ప్రధాని మాట్లాడుతూ అవని రాబోయే పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×