Interesting Facts About Pawan kalyan: కొణిదెల కళ్యాణ్ బాబు ఇది ఆయన పేరు.. పవర్ స్టార్ ఇది ఫాన్స్ పెట్టిన పేరు. ఆయన అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు. ఇక పబ్లిక్ మాస్టర్ ఆర్స్ట్ ప్రదర్శనలో పవన్ అనే అవార్డు లభించడంతో మూవీస్ లో, స్క్రీన్ నేమ్ గా పెట్టుకున్నారు. మొత్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక క్రేజ్.. ఒక బజ్.. ఒక మాస్ హిస్టీరియా..
తెలుగు రాష్ట్రాల్లో ఆయన మూవీ విడుదలైందంటే చాలు.. ఇక థియేటర్లలో పెద్ద పండుగే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటి సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ చిత్రాలలో గబ్బర్ సింగ్ ఒకటి. మోస్ట్ అవైటెడ్ రీరిలీజ్ మూవీస్ లలో ఇది ఉంటుంది. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 56వ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ మూవీస్ రీరిలీజ్ చేస్తున్నారు. మరీ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.
పవన్ కళ్యాణ్ అకీరా కొరసోవా అనే జపనీస్ ఫిల్మ్ మేకర్ రచనల పట్ల విపరీతమైన అభిమాని. తన కొడుకుకి కూడా అతని పేరే పెట్టారు. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందిన పవన్ కళ్యాణ్ కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు. తమ్ముడు, బద్రి, ఖుషి, గుడుంబా శంకర్ వంటి సినిమాలకు స్టంట్ కో-ఆర్డినేటర్ గా పనిచేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమా కోసం యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమాలో డూప్ లేకుండా కొన్ని రిస్కీ షార్ట్స్ లో నటించి ట్రెండ్ సెట్ చేశారు. 2003లో జానీ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఇది యునైటెడ్ స్టేట్స్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా 250 ప్రింట్ లతో విడుదలైన మొట్టమొదటి తెలుగు చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయినప్పటికి కల్ట్ స్టేటస్ పొందింది.
Also Read: ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి.. పవన్ కల్యాణ్‌కు చిరు బర్త్ డే విషెస్
ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించబడింది. లాస్ట్ లీఫ్ అనే హాలీవుడ్ మూవీ ప్రేరణతో జానీ కథ రాసుకున్న పవన్ కళ్యాణ్.. గుడుంబా శంకర్ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చారు. గబ్బర్ సింగ్ కు సీక్వెల్ గా వచ్చిన సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీకి కూడా స్టోరీ అందించారు. 2014లో స్టార్ ఇండియా సోబీలో పవన్ కళ్యాణ్ భారతదేశంలోని టాప్ 5 హీరోస్ లో ఒకరిగా నిలిచారు. ఎన్డీటీవి ఒక పోల్ నిర్వహించింది. ఇందులో పవన్ గూగుల్‌లో అత్యంత సోధించదగిన భారత సెలబ్రెటీ ఈ రాజకీయ వేత్తగా గుర్తించారు. 2013లో పోబ్స్ ఇండియా టాప్ 100 సెలబ్రెటీల జాబితాలో పవన్ కళ్యాణ్ 26వ స్థానంలో నిలిచారు. గుడుంబా శంకర్ సినిమాల్లోని అన్ని పాటలకు పవన్ స్వయంగా కొరియోగ్రఫీ చేశారు.
పంజా టైటిల్ సాంగ్ తో పాటుగా ఖుషీ చిత్రంలోని నాలుగు సాంగ్స్ కు విజువలైజేషన్ చేశారు. సైరా నరసింహారెడ్డి సినిమాకు కథకుడిగా వ్యవహరించారు. ఇక పవణ్ కళ్యాణ్ రాబోయే సినిమాల గురించి చూస్తే హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ మూవీ వస్తుంది. ఆ తర్వాత OG, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కోసం ఫాన్స్ వెయిటింగ్. ఈ నాలుగు సినిమాలు త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసే ఆలోచనలో వవన్ ఉన్నట్లు ఇటీవల కాలంలో ఆయన మాట్లాడిన మాటల్ని బట్టి తెలుస్తోంది. ఇక పాలిటిక్స్ విషయానికి వస్తే జనసేన పార్టీ పెట్టి పదేళ్లకు పైగా ఓపికగా ప్రజల్లో ఉంటూ సరైన టైమ్ లో సరైన నిర్ణయాలతో రాజకీయాల్లోనూ సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఇప్పటివరకు ఏ పార్టీకి సాధ్యం కానీ విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్నిస్థానాల్లోను నూటికి నూరు శాతం రిజల్ట్ సాధించిన ఏకైక పార్టీ నాయకుడుగా నిలిచారు.