BigTV English

Modi Tweet on Mohammed Shami Health: షమీ ఆపరేషన్ సక్సెస్.. త్వరగా కోలుకోవాలని మోదీ ట్వీట్

Modi Tweet on Mohammed Shami Health: షమీ ఆపరేషన్ సక్సెస్.. త్వరగా కోలుకోవాలని మోదీ ట్వీట్
Mohammed Shami After Surgery
Mohammed Shami After Surgery

Mohammed Shami undergoes ankle surgery: భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మోకాలికి జరిగిన సర్జరీ సక్సెస్ అయ్యింది. దీంతో అతడు వచ్చే నెలలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు దూరం కానున్నాడు. జూన్‌లో జరగనున్న T20 ప్రపంచ కప్‌లో ఆడేది అనుమానంగా మారింది.


ప్రపంచకప్ ఫైనల్ తర్వాత గాయపడిన షమీ లండన్‌కు వెళ్లి సర్జరీ చేయించుకున్నాడు. ఈ సందర్భంగా అతను మంగళవారం ట్విట్టర్ వేదికగా సర్జరీ సక్సెస్ అయ్యిందని తెలిపాడు. కోలుకోడానికి కొంత సమయం పడుతుంది.. తిరిగి గ్రౌండ్‌లో అడుగుపెట్టడానికి ఎదురుచూస్తున్నా అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

ఈ పోస్ట్‌పై స్పందించిన ప్రధాని మోదీ.. “మీరు త్వరగా కోలుకోవాలి. పూర్తి ఆరోగ్యంగా మారాలని కోరుకుంటున్నా. ధైర్యంతో గాయాన్ని అధిగమిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా.” అని ట్వీట్ చేశారు.

మహమ్మద్ షమీ చివరిసారిగా నవంబర్ 19న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆడాడు. ప్రపంచ కప్‌లో మొత్తంగా ఏడు మ్యాచుల్లో 24 వికెట్లు తీసుకుని సత్తా చాటాడు.

Read More: Jan Nicol Loftie-Eaton: నమీబియా ఆటగాడి విధ్వంసం.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ..

ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్‌కు ఆల్ క్యాష్ డీల్‌లో ట్రేడ్ చేసిన గుజరాత్ టైటాన్స్‌కు షమీ లేకపోవడం పెద్ద దెబ్బే. గత ఏడాది గుజరాత్ టైటాన్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసి.. టైటాన్స్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.

Related News

Manoj Tiwari: రోహిత్‌ను తప్పించేందుకు కుట్ర… అందుకే ప్లేయర్లకు బ్రాంకో టెస్టులు

Kuldeep Yadav: పెళ్లికి ముందే ఆ పని…ఆ లేడీతో కుల్దీప్ యాదవ్ ఎంజాయ్

Manoj Tiwary: ధోని పెద్ద దుర్మార్గుడు… నన్ను జట్టులోంచి కావాలనే తొలగించాడు.. మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు

Man Fires Gun During Cricket Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా కాల్పుల కలకలం.. అసలేం జరిగిందంటే

Avneet Kaur Kohli : విరాట్ కోహ్లీ పై అవ్నీత్ వివాదాస్పద వ్యాఖ్యలు… యాక్సిడెంట్ గా అంటూ

Dream11 – My11Circle : మోడీ సర్కార్ సంచలన నిర్ణయం.. డ్రీమ్ 11, మై సర్కిల్ 11 కు ఎన్ని కోట్ల నష్టం అంటే

Big Stories

×