BigTV English

Jan Nicol Loftie-Eaton: నమీబియా ఆటగాడి విధ్వంసం.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ

Jan Nicol Loftie-Eaton: నమీబియా ఆటగాడి విధ్వంసం.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ
Jan Nicol Loftie-Eaton Scored 33 ball Century
Jan Nicol Loftie-Eaton Scored 33 ball Century

Jan Nicol Loftie-Eaton Fastest T20I Century: నమీబియా బ్యాటర్ జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే సెంచరీ చేసి ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈటన్ చెలరేగాడు. 22 ఏళ్ళ ఈ బ్యాటర్ 36 బంతుల్లో 101 పరుగులు చేశాడు.


ఈటన్ విధ్వంసంతో నమీబియా భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల లక్ష్యాన్ని నేపాల్ ముందుంచింది. ఛేదనలో నేపాల్ 18.5 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 20 పరుగుల తేడాతో నమీబియా విజయం సాధించింది. బ్యాటింగ్‌లో అదరగొట్టిన ఈటన్ బౌలింగ్‌లో కూడా రాణించాడు. 3 ఓవర్లు బౌలింగ్ వేసిన ఈటన్ 29 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

Read More: IND vs ENG 4th Test Records: రాంచీ టెస్టు రికార్డులివే..


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నమీబియాకు ఓపెనర్లు శుభారంభం అందించారు. మూడు వికెట్లు పడ్డాక బ్యాటింగ్‌కు వచ్చిన ఈటన్ 8 సిక్సర్లు, 11 ఫోర్లతో నేపాల్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ సెంచరీతో ఈటన్ టీ20 మ్యాచుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు నేపాల్ ఆటగాడు కుశాల్ మల్లా పేరు మీద ఉంది. 34 బంతుల్లో అతను సెంచరీ సాధించాడు. అతని తర్వాత స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో), ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ( 35 బంతుల్లో), చెక్ రిపబ్లిక్ ఆటగాడు సుదేశ్ విక్రమశేకర ( 35 బంతుల్లో) ఉన్నారు.

Related News

Manoj Tiwari: రోహిత్‌ను తప్పించేందుకు కుట్ర… అందుకే ప్లేయర్లకు బ్రాంకో టెస్టులు

Kuldeep Yadav: పెళ్లికి ముందే ఆ పని…ఆ లేడీతో కుల్దీప్ యాదవ్ ఎంజాయ్

Manoj Tiwary: ధోని పెద్ద దుర్మార్గుడు… నన్ను జట్టులోంచి కావాలనే తొలగించాడు.. మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు

Man Fires Gun During Cricket Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా కాల్పుల కలకలం.. అసలేం జరిగిందంటే

Avneet Kaur Kohli : విరాట్ కోహ్లీ పై అవ్నీత్ వివాదాస్పద వ్యాఖ్యలు… యాక్సిడెంట్ గా అంటూ

Dream11 – My11Circle : మోడీ సర్కార్ సంచలన నిర్ణయం.. డ్రీమ్ 11, మై సర్కిల్ 11 కు ఎన్ని కోట్ల నష్టం అంటే

Big Stories

×