BigTV English
Advertisement

Clarity on Harihara Veeramallu: హరిహర వీరమల్లు మూవీపై నిర్మాత క్లారిటీ!

Clarity on Harihara Veeramallu: హరిహర వీరమల్లు మూవీపై నిర్మాత క్లారిటీ!

Harihara Veeramallu is the producer who gave clarity on the movie


Harihara Veeramallu is the producer who gave clarity on the movie: టాలీవుడ్ హీరో, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బిగ్ స్క్రీన్ పై కనిపిస్తే చాలు పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫూనకాలనే చెప్పాలి. ఇక తన సినిమాల్లో తన మ్యానరిజంతో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే పవర్ స్టార్ చాలాకాలం నుండి జనసేన పార్టీని స్థాపించి ఏపీ పాలిటిక్స్ వైపు ఫోకస్ పెట్టారు. అంతేకాకుండా ఈ పాలిటిక్స్ లో బిజీ అయిపోయారు. అయితే తన నెక్ట్స్ మూవీ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు ఈ మూవీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం. ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకొస్తున్నట్లు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఇంకేముంది ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి.

హరిహర వీరమల్లు షూటింగ్ లో పవన్ కల్యాణ్ పాల్గొనడంపై స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ ఏపీలో ఎన్నికలు పూర్తయిన తర్వాత వస్తాడని ప్రొడ్యూసర్ ఏఎం రత్నం స్పష్టం చేశారు. ఈ మూవీతో పవన్ కల్యాణ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, జాతీయస్థాయిలో పవర్ స్టార్ అవుతాడని అన్నారు. ఈ మధ్యే కొన్ని సీన్ల కోసం పవన్ షూటింగ్ పూర్తి చేశాడని.. మళ్లీ ఎన్నికల తర్వాత షూటింగ్ చేస్తాడని రత్నం క్లారిటీ ఇచ్చాడు. ఇక హరిహర ఇంత టైం తీసుకుంటుందన్న అంశంపైనా ఏఎం రత్నం స్పందించారు. నేను డబ్బు సంపాదించాలని అనుకుంటే ఏదో కొన్ని రోజుల్లో పూర్తయ్యే సినిమాలపై ఫోకస్ పెట్టి ఇన్వెస్ట్ చేసేవాడినని, కానీ.. ఈ మూవీ 17వ శతాబ్దానికి సంబంధించినది. దీనికి ఇంకాస్త టైం పడుతుందని స్పష్టం చేశారు.


Read More: ‘గేమ్ ఛేంజర్’ ఫస్ట్ సింగిల్, టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. మెగా ఫ్యాన్స్‌కు పండగే..!

ఈ మూవీకి టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీకి మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కుతోంది. అయితే చాలా ఏళ్లుగా ఈ మూవీ కొనసాగుతూనే ఉండటం, మధ్యలో నిర్మాతకు ఆర్థిక కష్టాలని, స్క్రిప్ట్ లో కొన్ని కీలకమైన మార్పులు చేశారని, తర్వాత ఏకంగా డైరెక్టర్ క్రిష్ మూవీ నుంచే తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. అటు పవన్ కల్యాణ్ కూడా పెండింగ్ లో ఉన్న మూవీస్ ని కంప్లీట్ చేస్తూ ఈ మూవీని లైట్ తీసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చాయనే చెప్పాలి. ఈ మూవీని స్టార్ట్ చేసిన తర్వాత పవన్ సినిమాలు భీమ్లా నాయక్, బ్రో లాంటి చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఓజీ మూవీ రిలీజ్ డేట్ కూడా ఈ మధ్యే రివీల్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నిర్మాత క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ కి కొంత ఊరట కలిగిందనే చెప్పాలి.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×