BigTV English

Punjab: కేన్ మామకు పంజాబ్ గాలం

Punjab: కేన్ మామకు పంజాబ్ గాలం

డిసెంబర్లో జరగబోయే ఐపీఎల్-2023 మినీ వేలం కోసం… ఫ్రాంచైజీలన్నీ కొందరు ఆటగాళ్లను వదులుకోగా.. మరికొందర్ని జట్టులోనే పెట్టుకున్నాయి. ఫ్రాంచైజీలు వదులుకున్న ఆటగాళ్లలో ఈసారి ఎక్కువ మంది స్టార్లు ఉండటం… అందర్నీ ఆశ్చర్య పరిచింది. అయితే, కోట్లు పోసి కొన్న ప్రముఖ ఆటగాళ్లు కూడా అన్ని సీజన్లలోనూ విఫలమవుతూ వస్తుండటంతో… ఓపిక నశించిన ఫ్రాంచైజీలు… అలాంటి ఆటగాళ్లను వేలం కోసం విడుదల చేశాయి.


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విడిచిపెట్టిన ఆటగాళ్లలో… న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా ఉన్నాడు. ఇప్పుడతణ్ని సొంతం చేసుకోవాలని భావిస్తోంది… పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ. నిరుడు జరిగిన వేలంలో మయాంక్ అగర్వాల్ కోసం రూ.12 కోట్లు ఖర్చు చేసింది… పంజాబ్. జట్టుకు ఏకంగా కెప్టెన్ ని కూడా చేసింది. కానీ… మయాంక్ దారుణంగా విఫలమయ్యాడు. 13 ఇన్నింగ్స్ లు ఆడి… కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో… అతణ్ని వదిలేసిన పంజాబ్.. ఇప్పుడు కేన్ మామ వైపు చూస్తోంది. T20 వరల్డ్ కప్ లో కివీస్ టీమ్ ను సెమీస్ దాకా చేర్చిన కేన్ విలియమ్సన్ ను రూ.10 కోట్లు పెట్టి అయినా కొనాలని పంజాబ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అతడు జట్టులోకి వస్తే… కచ్చితంగా విజయపథంలో నడిపిస్తాడని నమ్ముతోంది… పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ. ప్రస్తుతం పంజాబ్ ఖాతాలో రూ.32 కోట్లకు పైగా ఉంటడంతో… అందులో మూడో వంతుకుపైగా కేన్ కోసం ఖర్చు చేసేందుకు ఫ్రాంచైజీ సిద్ధంగా ఉందని చెబుతున్నారు.

నిరుడు ఐపీఎల్ వేలంలో రూ.14 కోట్లకు విలియమ్సన్‌ను సొంతం చేసుకుంది… సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. అయితే ఆ సీజన్లో కేన్ మామ దారుణంగా విఫలమయ్యాడు. బ్యాటర్ గానే కాదు… కెప్టెన్ గా జట్టును కూడా విజయవంతంగా నడిపించలేకపోయాడు. దాంతో… కేన్ తో పాటు విండీస్ ఆటగాళ్లు నికోలాస్ పూరన్, రొమారియో షెపర్డ్ లను కూడా వదులుకుంది… సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీ.


Tags

Related News

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Big Stories

×