BigTV English
Advertisement

IPL : సికందర్ రజా, షారుక్ అదుర్స్.. లక్నోకు పంజాబ్ షాక్..

IPL : సికందర్ రజా, షారుక్ అదుర్స్.. లక్నోకు పంజాబ్ షాక్..

IPL : ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. లక్నో, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా చివరి ఓవర్ వరకు ఆసక్తికరంగా సాగింది. షారుక్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్ తో పంజాబ్ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ ( 74, 56 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సు) ఒంటరి పోరాటం చేశాడు. ఓపెనర్ కైల్ మేయర్స్ ( 29, 23 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులు ) మెరుపులు ఎక్కువ సేపు కొనసాగలేదు. ఆ తర్వాత బ్యాటర్లు ఎవరూ మంచి ఇన్నింగ్స్ ఆడలేదు.


దీపక్ హుడా (2), నికోలక్ పూరన్ (గోల్డెన్ డక్ ) తీవ్రంగా నిరాశపర్చారు. కృనాల్ పాండ్యా ( 18), మార్కస్ స్టొయినిస్ (15) కాసేపు నిలబడినా భారీ ఇన్నింగ్స్ ఆడలేదు. దీంతో పంజాబ్ ముందు 160 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే లక్నో ఉంచగలిగింది. పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్ 3 వికెట్లు, రబడా రెండు వికెట్లు, అర్ష్ దీప్ సింగ్, హర్ ప్రీత్ బ్రార్, సికందర్ రజా తలో వికెట్ తీశారు.

కెప్టెన్ థావన్ అందుబాటులో లేకపోవడంతో ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టుకు సామ్ కరన్ నాయకత్వం వహించాడు. పంజాబ్ పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్ అథర్వ వికెట్ ను కోల్పోయింది. ప్రభ్ సిమ్రాన్ సింగ్ (4) వెంటనే అవుట్ అయ్యాడు. ఈ దశలో మథ్యూ షార్ట్ ( 34 , 22 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సు ) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. హర్ ప్రీత్ సింగ్ (22) ఫర్యాలేదనించాడు. వీళ్లిద్దరూ అవుటైన తర్వాత సికందర్ రజా (57, 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు) అదరగొట్టాడు. పంజాబ్ విజయానికి 21 పరుగులు దూరంలో ఉండగా సికందర్ రజా అవుట్ కావడంతో మ్యాచ్ పై ఉత్కంఠ రేగింది.


పంజాబ్ గెలవాలంటే చివరి 2 ఓవర్లలో 20 పరుగులు చేయాలి. షారుక్ ఖాన్ మెరుపులతో 19 ఓవర్ లో 13 పరుగులు వచ్చాయి. దీంతో చివరి ఓవర్ లో 7 పరుగులు అవసరమయ్యాయి. షారుక్ ఖాన్ ( 23, 10 బంతుల్లో 1 ఫోర్ , 2 సిక్సులు ) తొలి రెండు బంతుల్లో రెండేసి పరుగులు తీశాడు. మూడో బంతికి బౌండరీ కొట్టి పంజాబ్ ను విజయతీరాలకు చేర్చాడు. లక్నో బౌలర్లలో యుధ్ వీర్ సింగ్, మార్క్ ఉడ్ , రవి బిష్టోయ్ రెండేసి వికెట్లు తీశారు. కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా తలో వికెట్ పడగొట్టారు.

హాఫ్ సెంచరీతో పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించిన సికందర్ రజా కు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్ లో ఓడినా లక్నో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు మొత్తం 5 మ్యాచ్ ల్లో 3 విజయాలు సాధించింది. మరో రెండు మ్యాచ్ ల్లో ఓడింది. పంజాబ్ 5 మ్యాచ్ ల్లో 3 విజయాలు, 2 ఓటములతో పాయింట్ల పట్టికలో 4 స్థానంలో ఉంది.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటి ద‌గ్గ‌ర క‌ల‌క‌లం…కేక్ తీసుకొచ్చిన ఆగంత‌కుడు !

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Big Stories

×