R Ashwin : సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఊహించడం పెద్ద కష్టమే అవుతుంది అని చెప్పాలి. నిన్న మొన్నటి వరకు ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా జట్లు టెస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా ఆడాయి. మూడో టెస్ట్ మ్యాచ్ వద్దకు వచ్చే సరికి ఏమైందో తెలియదు. ఆటను ఆటలా కాకుండా టైమ్ పాస్ చేయడం కోసం ఆడుతున్నారు. తొలుత ఇంగ్లాండ్ బ్యాటర్లు అలా చేయడంతో టీమిండియా ఆటగాళ్లు ఆగ్రహావేశానికి గురయ్యారు. మరోవైపు వారిని కొందరూ క్రికెటర్లు బండ బూతులు కూడా తిట్టారు. ఇక ఇదిలా ఉంటే.. తాజాగా భారతీయ బ్యాటర్లు కూడా అలాగే వ్యవహరించారు. నిన్న జరిగిన మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్లు టైం వేస్ట్ చేశారు. వరుసగా వికెట్లు కోల్పోతుండటంతో వికెట్లను అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఇండియా ఆటగాళ్లు కే.ఎల్. రాహుల్, ఆకాశ్ దీప్ టైమ్ వేస్ట్ చేసారు. దీంతో అప్పుడు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చప్పట్లు కొట్టి వారిని ర్యాగింగ్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
టీమిండియా ఆటగాళ్ల పై అశ్విన్ విచిత్ర కామెంట్స్..
ఈ నేపథ్యంలో టీమిండియా టెస్ట్ మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. టీమిండియా ఆటగాళ్లు భలే నాటకాలు ఆడుతున్నాడరని.. బంతి తగలగానే ఫిజియో థెరపిస్ట్ ని పిలవడం ఏంటి..? అని ఆశ్యర్యపోయినట్టు వెల్లడించారు. మొత్తానికి అశ్విన్ టీమిండియా ఆటగాళ్ల ఇజ్జత్ తీసేశాడు. ఇంతకు ముందు కూడా ఇటు ఇండియా, అటు ఇంగ్లాండ్ ఆటగాళ్ల ఇజ్జత్ తీసాడు అశ్విన్. బ్యాటర్లు బాధ్యత తీసుకొని ఆడాలి. లీడ్స్ టెస్ట్ లో భారత జట్టు బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఏకంగా 5 సెంచరీలు బాదారు. కానీ భారీ శతకాలు నమోదు కాలేదు. 150 ప్లస్ స్కోర్లు రాలేదు. మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. బ్యాటింగ్ లో లోయర్ ఆర్డర్ నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు. మన జట్టు ఫాస్ట్ బౌలర్లు బ్యాటింగ్ చేయలేరు. వాళ్లకు అస్సలు పరుగులు చేయడం రాదని స్పష్టం చేశాడు అశ్విన్. టీమిండియా ఆటగాళ్ల నుంచి అశ్విన్ ఇలా అనడం ఏంటి..? అని అందరూ ఆశ్చర్యపోవడం విశేషం.
ఇంగ్లాండ్ కి కౌంటర్ ఇచ్చిన భారత్..
ఈ మధ్య కాలంలో టీమిండియా–ఇంగ్లాండ్ ఆటగాళ్ల మధ్య తరచూ వివాదాలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి ఇవి ఇప్పటి నుంచి జరగడటం లేదు. 2002లో కూడా ఓ వివాదం జరిగింది. ఆండ్రూ ఫ్లింటప్ ముంబైలో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధిస్తే.. షర్ట్ విప్పి డ్యాన్స్ చేయగా.. దానికి కౌంటర్ గా అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా లార్డ్స్ వేదిక గా 2002లో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 315 పరుగులు ఛేదించింది. దీంతో అప్పుడు లార్డ్స్ వేదిక బాల్కనీలో షర్ట్ విప్పేసి డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేసాడు. ఇది అప్పట్లో సంచలనంగా మారింది. తాజాగా జరుగుతున్ మ్యాచ్ లో తొలుత ఇంగ్లాండ్ జట్టు బ్యాటర్ క్రాలీ టైమ్ వేస్ట్ చేయగా.. టీమిండియా బ్యాటర్లు కే.ఎల్. రాహుల్, ఆకాశ్ దీప్ టైమ్ వేస్ట్ చేసి కౌంటర్ ఇచ్చారు. ఇక దీనిపై కొందరూ పాజిటివ్ గా స్పందింస్తే.. మరికొందరూ నెగిటివ్ గా స్పందించడం విశేషం.