BigTV English

War 2 Story Leak: వార్ 2 స్టోరీ లీక్.. వార్నీ ఇన్నాళ్లు ఎన్టీఆర్ ను విలన్ ను చేశారు కదరా?

War 2 Story Leak: వార్ 2 స్టోరీ లీక్.. వార్నీ ఇన్నాళ్లు ఎన్టీఆర్ ను విలన్ ను చేశారు కదరా?

War 2 Story Leak: ప్రముఖ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR).  దేవరా(Devara ) సినిమాతో సైలెంట్ గా రూ.600 కోట్ల క్లబ్లో చేరిపోయిన ఈయన.. అటు బాలీవుడ్ లో కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ‘డ్రాగన్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మరొకవైపు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బాలీవుడ్ రంగ ప్రవేశం చేశారు ఎన్టీఆర్.


వార్ 2 నుండీ టీజర్.. విమర్శలు తప్పలేదుగా..

అందులో భాగంగానే హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటిస్తున్న ‘వార్ 2’ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.  దీనికి తోడు ఎన్టీఆర్ బర్త్డే రోజున ఈ సినిమా నుండి ఆయన లుక్ కి సంబంధించి టీజర్ విడుదల చేశారు. కానీ ఈ టీజర్ విపరీతమైన విమర్శలు ఎదుర్కొంది.  ఈ టీజర్ పేరుకే ఎన్టీఆర్ బర్త్డే రోజున విడుదల చేశారు. కానీ దీనిని హృతిక్ రోషన్ ను హైలెట్ చేయడానికి విడుదల చేసినట్టు ఉంది అంటూ కూడా కామెంట్లు చేశారు.


వార్ 2 లో ఎన్టీఆర్ పాత్ర అదేనా?

అంతేకాదు ఇక్కడ హృతిక్ రోషన్ ని ఎక్కువ చేసి చూపించారని, ఎన్టీఆర్ ను తక్కువ చేశారని ఇలా ఎవరికి వారు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇకపోతే అన్నింటినీ పూర్తి చేసి ఆగస్టు 14వ తేదీన సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వం వహిస్తూ ఉండగా.. కియారా అద్వానీ(Kiara advani) హీరోయిన్గా నటిస్తోంది.. ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ విలన్ గా నటించబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో సడన్గా ఈ సినిమా స్టోరీ లీక్ అయింది. ఈ స్టోరీ విన్న తర్వాత ఇన్ని రోజులు ఎన్టీఆర్ ను  విలన్ ను చేశారు కదరా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

వార్ 2 సినిమా స్టోరీ..

ఇక వార్ 2 సినిమా స్టోరీ విషయానికి వస్తే.. వార్ మొదటి పార్ట్ తర్వాత ఏజెంట్ కబీర్ (హృతిక్) ఇండియాకి రాకుండా విదేశాలలోనే ఉండాలని ఫిక్స్ అవుతాడు. దీనివల్ల ఇండియాకి వ్యతిరేకంగా మారుతాడు. ఈ కబీర్ ని పట్టుకోవడానికి మరో మోస్ట్ వైలెంట్ ఏజెంట్ అయిన విక్రమ్ (ఎన్టీఆర్) ను ఇండియా రంగంలోకి దింపుతుంది.. ఇక తర్వాత ఈ ఇద్దరి మధ్య జరిగే వారే సినిమా స్టోరీ..

ఈ సినిమా చాలావరకు వేరే దేశంలోనే షూటింగ్ నిర్వహించారు. అలాగే ఈ సినిమా YRF స్పై యూనివర్స్ లో ఇప్పటివరకు వచ్చిన సినిమాల లాగానే రొటీన్ స్టోరీ గా ఉండబోతుందట. అయితే హృతిక్ – ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేషాలు బాగుంటాయని సమాచారం . ఇకపోతే ఈ విషయం తెలిసి ఇన్ని రోజులు ఈ సినిమాలో ఎన్టీఆర్ ను  విలన్ గానే అనుకున్నారు. నిజానికి ఎన్టీఆర్ ఇందులో విలన్ పాత్ర కాదని, జస్ట్ నెగిటివ్ షేడ్స్ ఉన్న ఒక ఏజెంట్ పాత్రలో నటిస్తున్నారని సమాచారం. మొత్తానికి అయితే ఎన్టీఆర్ పాత్ర  అలాగే స్టోరీ కథ లీక్ అవ్వడంతో అభిమానులు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. మరి ఏజెంట్ పాత్రలో నటించబోతున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో బాలీవుడ్ లో మొదటి సక్సెస్ అందుకోవాలని కూడా ఫ్యాన్స్ కోరుకుంటూ ఉండడం గమనార్హం.

Related News

Teja Sajja: అంత మంచి సినిమా ఎలా వదిలేసావు భయ్యా?

Bandla Ganesh: కొడితే నీలా కొట్టాలి రా బాబు దెబ్బ, బండ్లన్న కొత్త భజన?

Teja Sajja: ఒక పెద్ద దర్శకుడు నన్ను మోసం చేశాడు

Ileana D’Cruz: ఆ క్షణం నరకం అనుభవించా.. కొడుకు విషయంలో నిజాలు బయటపెట్టిన ఇలియానా!

TVK Vijay: తలపతి విజయ్ పార్టీ పైన త్రిష ఆసక్తికర కామెంట్స్

Pookie: సోషల్ మీడియా దెబ్బకి పూకి ను కాస్త బూకి చేశారు

Big Stories

×