Hyderabad fire accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బహదూర్‌పురాలో ఓ లారీ మెకానిక్ షాప్ లో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న మూడంతస్తుల భవనానికి మంటలు వ్యాపించాయి. దీంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే అగ్ని మాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు.
ALSO READ: Bank of Baroda: డిగ్రీ అర్హతతో 4000 జాబ్స్.. తెలంగాణ, ఏపీలో కూడా ఖాళీలు.. స్టైఫండ్ ఇచ్చి ట్రైనింగ్..
దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నాయి. గతంలో కూడా ఇదే లారీ మెకానిక్ షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఘటనకు గల కారణాలపై పోలీస్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.