Ind vs SA Women: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025 ) నేపథ్యంలో ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మహిళల ప్రపంచకప్ లో భాగంగా ఇవాళ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ( India Women vs South Africa Women ) మధ్య బిగ్ ఫైట్ ఉండనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు 9 మ్యాచులు పూర్తిగా కాగా, ఇవాళ పదవ మ్యాచ్ నిర్వహించనున్నారు. విశాఖపట్నం వేదికగా టీమ్ ఇండియా వర్సెస్ మహిళల సౌతాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించనున్నారు.
ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మహిళల జట్ల మధ్య విశాఖలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ( Dr. Y.S. Rajasekhara Reddy Cricket Stadium, Visakhapatnam ) వేదికగా ఇవాళ వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ నేపథ్యంలో వర్షం విలన్ గా మారే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. సరిగ్గా సాయంత్రం ఐదు గంటల తర్వాత వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారబోతున్నట్లు అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.వర్షం పడితే కచ్చితంగా సాయంత్రం మంచి జోరుగా పడే ప్రమాదం ఉందని అంటున్నారు. టాస్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే వర్షం ఉండే ఛాన్స్ ఉందట.
ఒకవేళ వర్షం పడి, మ్యాచ్ ఆడలేని పరిస్థితి ఉంటే రద్దు చేస్తారు. అప్పుడు టీమిండియా కు అటు సౌత్ ఆఫ్రికాకు చెరో పాయింట్ వస్తుంది. అలా మరో పాయింట్ వస్తే ఇండియా నెంబర్ 2 స్థానానికి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక ఇవాళ్టి మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. వర్షం పడే అవకాశాలు ఉన్న తరుణంలో, బౌలింగ్ తీసుకుంటేనే అడ్వాంటేజ్ ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్ లో టాస్ చాలా కీలకం కానుంది. ఇది ఇలా ఉండగా, ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025 ) పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ రెండో స్థానంలో ఉంది. ఇండియా మూడో స్థానంలో నిలిచింది.
Also Read: Abhishek Sharma Car: అభిషేక్ కారుకు ఇండియాలో నో పర్మిషన్…దుబాయ్ లో వదిలేశాడుగా !
ఇండియా ప్రాబబుల్ XI: స్మృతి మంధాన, ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్), అమంజోత్ కౌర్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్/క్రాంతి గౌడ్
దక్షిణాఫ్రికా ప్రాబబుల్ XI: లారా వోల్వార్డ్ట్ (సి), తజ్మిన్ బ్రిట్స్, సునే లూయస్, మారిజానే కాప్, అన్నెకే బాష్, సినాలో జాఫ్తా (WK), క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, అన్నరీ డెర్క్‌సెన్/మసబాటా క్లాస్, అయాబొంగా ఖాకా, నాన్‌కులులేకో మ్లా.