Harshit Rana Car: టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా మరోసారి గౌతమ్ గంభీర్ కొడుకు అనిపించుకున్నాడు. టీమిండియా ప్లేయర్లు అందరూ ఓ బస్సులో వస్తే, హర్షిత్ రాణా మాత్రం ఓ రేంజ్ లో కారులో ఎంట్రీ ఇచ్చాడు. స్పెషల్ గెస్ట్ తరహాలో గౌతమ్ గంభీర్ ఇంటికి డిన్నర్ కోసం వచ్చాడు హర్షిత్ రాణా. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఒరేయ్ నువ్వు నిజంగానే గౌతమ్ గంభీర్ కొడుకు అనిపించుకున్నావ్? నువ్వేమైనా స్పెషల్ గెస్ట్ వా? హీరో రేంజ్ లో ఫీల్ అవుతున్నావ్ అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిన్న టీమిండియా ప్లేయర్లకు మంచి దావత్ ఇచ్చాడు. ఢిల్లీలోని తన నివాసానికి టీమిండియా ప్లేయర్లు అందరనీ పిలిపించుకొని పార్టీ ఇచ్చాడు. వరుస సిరీస్ లతో బిజీగా ఉన్న టీమిండియా ప్లేయర్లను కాస్త రిలాక్స్ చేసేందుకు గౌతమ్ గంభీర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దానికి తోడు టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య పదవ తేదీన ఢిల్లీ వేదికగా టెస్ట్ మ్యాచ్ జరగనుంది. దాంతో అప్పటికే ఢిల్లీకి వచ్చిన ప్లేయర్లను ఆహ్వానించాడు గౌతమ్ గంభీర్. ఢిల్లీలో ఉన్న తన ప్యాలస్ లో టీమ్ ఇండియా క్రికెట్ అలా అందరికీ మంచి పార్టీ ఏర్పాటు చేశాడు. టీమిండియా ప్లేయర్లతోపాటు సపోర్ట్ స్టాఫ్ కూడా ఆయన నివాసానికి వచ్చి పార్టీ ఎంజాయ్ చేశారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కూడా పార్టీకి హాజరయ్యారు. బిసిసిఐ అనుమతి తీసుకొని మరి గౌతమ్ గంభీర్ ఈ డిన్నర్ పార్టీ ఇచ్చారు.
ఢిల్లీలోని ప్రముఖ హోటల్ నుంచి టీమిండియా ప్లేయర్లు, ప్రత్యేక బస్సులో డిన్నర్ కోసం గౌతమ్ గంభీర్ నివాసానికి చేరుకున్నారు. గిల్ అలాగే బుమ్రా, అటు కేఎల్ రాహుల్ లాంటి సీనియర్ ప్లేయర్లు అందరూ ఈ ప్రత్యేక లగ్జరీ బస్సులో గౌతమ్ గంభీర్ నివాసానికి చేరుకున్న వీడియోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా మాత్రం ఓ స్పెషల్ కారులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. అప్పట్లో విరాట్ కోహ్లీ ఇలాగే కార్లలో ప్రతి ఈవెంట్ కు వెళ్లేవాడు. ఇప్పుడు హర్షిత్ రాణా కూడా అలా తయారైపోయాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో.. గౌతమ్ గంభీర్ అసలు సిసలు కొడుకు వీడే… అందుకే కారులో ఎంట్రీ ఇచ్చాడని నెటిజన్స్ ఆడుకుంటున్నారు. టీమిండియా పర్మినెంట్ ప్లేయర్ కాబట్టి ఇలా ప్రైవేట్ కార్లలో తిరుగుతున్నాడని కూడా సెటైర్లు పేల్చుతున్నారు.
Also Read: Abhishek Sharma Car: అభిషేక్ కారుకు ఇండియాలో నో పర్మిషన్…దుబాయ్ లో వదిలేశాడుగా !
Harshit Rana arrived separately in a special car at coach Gautam Gambhir’s house for the team dinner.👌🏼 pic.twitter.com/ucse2nQL1a
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) October 8, 2025
Gautam Gambhir hosted dinner at his home for team India. Where is Harshit Rana?pic.twitter.com/poLZwXX5Nc
— Sunil The Cricketer (@1sInto2s) October 8, 2025